తల్లి వేధింపులు: బాలికకు దుబాయ్ పోలీసుల అండ
- July 17, 2016
తల్లి వేధింపుల నుండి 12 ఏళ్ళ బాలికకు దుబాయ్ పోలీసులు విముక్తి కల్పించారు. ఆ బాలిక నుంచి ఫోన్ కాల్ ద్వారా అందిన ఫిర్యాదు మేరకు క్యుసైస్ పోలీసు - విక్టిమ్ కేర్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించింది. క్యుసైప్ పోలీస్ స్టేషన్ డైరెక్టర్ కల్నల్ అహ్మద్ తని బిన్ ఘలితా మాట్లాడుతూ, తమ డిపార్ట్మెంట్ పిల్లల్ని వేధిస్తున్న నాలుగు కేసుల్ని టాకిల్ చేసినట్లుగా వెల్లడించారు. ఇందులో జాహిర్ కేసు కూడా ఒకటి. బాధితురాల్ని విక్టిమ్ కేర్ ఎంప్లాయీ, దుబాయ్ ఫౌండేషన్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్‌కి తరలించారు. బాధితురాలి తల్లి పలు కేసుల్లో వాంటెడ్‌గా పోలీసులు గుర్తించారు. బాధితురాలు, తనను డ్రైవర్ లైంగికంగా వేధించినట్లు తొలుత పేర్కొంది. అయితే ఆ తర్వాత ఆమే స్వయంగా ఆ ఆరోపణల్ని ఖండించింది. బాధితురాలు తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉందని వైద్యులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







