రఖ్యౌట్ - ధల్కౌట్ మధ్య రహదారి నిర్మాణం ప్రారంభం..!!
- August 18, 2025
సలాలా: ధోఫర్ గవర్నరేట్‌లోని రఖ్యౌట్ - ధల్కౌట్ విలాయత్‌లను కలిపే 20 కిలోమీటర్ల రహదారి నిర్మాణ పనులను ఒమన్ రవాణా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ధోఫర్ విలాయత్‌ల మధ్య రోడ్డు నెట్‌వర్క్‌లను అభివృద్ధి చేయడంతోపాటు లాజిస్టికల్ మరియు టూరిజం కనెక్టివిటీని మెరుగు పరుస్తుందని ఇంజినీర్ మొహమ్మద్ తబుక్ తెలిపారు.
కొత్త రోడ్డు 12 మీటర్ల వెడల్పుతో పర్వత ప్రాంతాల గుండా వెళుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ రెండు విలాయత్‌ల మధ్య ప్రయాణ దూరాన్ని 60 కిలోమీటర్ల నుండి దాదాపు 20 కిలోమీటర్లకు తగ్గిస్తుందని ఆయన చెప్పారు. ఈ రహదారి నీటి బుగ్గలు, వాడిలు, పురావస్తు ప్రదేశాలు మరియు బీచ్‌లు వంటి అనేక ప్రముఖ సహజ పర్యాటక ప్రదేశాల గుండా వెళుతుందని, ముఖ్యంగా వర్షాకాలంలో ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని పెంచడానికి ఇది కీలక దోహదపడుతుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!