'భద్రకాళి' నుంచి బ్యూటీఫుల్ లవ్ సాంగ్ మారెనా రిలీజ్
- August 21, 2025
తెలుగు ప్రేక్షకులను అలరించిన 'మార్గన్' విజయం తర్వాత విజయ్ ఆంటోనీ మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్‌తో 'భద్రకాళి' వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.
మేకర్స్ ఫస్ట్ సింగిల్ మారెనా ని రిలీజ్ చేసి మ్యూజిక్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. విజయ్ ఆంటోని బ్యూటీఫుల్ లవ్ సాంగ్ గా కంపోజ్ చేశారు.
భాష్యశ్రీ రాసిన లిరిక్స్ హత్తుకునేలా వున్నాయి. అభిజిత్ అనిల్‌కుమార్ వోకల్స్ మరింత ఎమోషన్ ని యాడ్ చేశాయి. ఈ లవ్ సాంగ్ ఆడియన్స్ కి ఇన్స్టంట్ గా కనెక్ట్ అవుతోంది.
తెలుగులో మార్గన్ సినిమాను విజయం దిశగా నడిపించిన ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేస్తుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సపోర్ట్ కూడా ఉండడంతో ప్రాజెక్ట్‌పై మంచి బజ్ ఉంది.
ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృష్ణపాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బాట్, రియా జితు, మాస్టర్ కేశవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
టాప్ టెక్నికల్ టీం ఈ సినిమాకి పని చేస్తున్నారు. షెల్లీ కాలిస్ట్ డీవోపీ, విజయ్ ఆంటోనీ స్వయంగా మ్యూజిక్ అందిస్తున్నారు. రేమండ్ డెరిక్ ఎడిటర్. రాజశేఖర్ ఫైట్ మాస్టర్. శ్రీరమన్ ఆర్ట్ డైరెక్టర్. తెలుగులో డైలాగ్స్‌ని రాజశేఖర్ రెడ్డి రాశారు.
'భద్రకాళి' సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది.
నటీనటులు: విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బోట్, రియా జిత్తు, మాస్టర్ కేశవ్
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం - అరుణ్ ప్రభు
నిర్మాత - రామాంజనేయులు జవ్వాజి (సర్వంత్ రామ్ క్రియేషన్స్)
సమర్పణ- విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్- మీరా విజయ్ ఆంటోని
తెలుగు రిలీజ్ - ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ - స్పిరిట్ మీడియా
DOP - షెల్లీ కాలిస్ట్
సంగీతం - విజయ్ ఆంటోని
ఎడిటర్ - రేమండ్ డెరిక్
యాక్షన్ - రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్ - శ్రీరామన్
తెలుగు రైటర్ - రాజశేఖర్ రెడ్డి
డిజిటల్ మార్కెటింగ్- సౌత్ బే
పీఆర్వో - వంశీ-శేఖర్
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్‌లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్‌లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







