‘SSMB 29’ కోసం రంగంలోకి హాలీవుడ్ దిగ్గజం
- August 21, 2025
ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టి (SSMB 29) మీదే.డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి తెరపైకి తెస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి భారీ అంచనాలు నెలకొన్నాయి.బాహుబలి, RRR లాంటి ఘన విజయాల తర్వాత రాజమౌళి నుంచి వచ్చే ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది.SSMB 29 టైటిల్, ఫస్ట్‌లుక్ నవంబర్ 2025లో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.దీనికి ప్రత్యేకత ఏమిటంటే, ఈ రిలీజ్‌ను Avataar డైరెక్టర్ జేమ్స్ కామెరన్ చేతుల మీదగా చేయాలనే రాజమౌళి ప్లాన్ చేస్తున్నారట.జేమ్స్ కామెరన్ నవంబర్‌లో (Avatar 3):The Fire and Ash ప్రమోషన్ కోసం ఇండియాకు వస్తున్నట్లు సమాచారం.అవతార్ సినిమాల స్థాయిలోనే హైప్ తెచ్చేలా SSMB29ను ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో రాజమౌళి ఈ ఆలోచనలో ఉన్నారు.
ఇది ఒక సాధారణ తెలుగు సినిమా కాదు.SSMB 29 ఒక గ్లోబ్-ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్.విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్, అడ్వెంచరస్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.ఇక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 1000 కోట్ల రూపాయలు!ఇంత భారీ బడ్జెట్‌తో మేకింగ్ జరుగుతున్న ఈ ప్రాజెక్ట్‌లో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
రాజమౌళి స్టైల్ ప్రకారం, ఈ సినిమా కూడా చాలా సైలెంట్‌గా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక అప్‌డేట్స్ లేకుండా, మీడియా సమావేశాలు లేకుండా గోప్యతలో పనులు జరుగుతున్నాయి.ఇక మహేష్ బాబు తన 50వ పుట్టినరోజు సందర్భంగా “Globetrotter” అనే పోస్టర్‌ను రిలీజ్ చేసి చిన్న హింట్ ఇచ్చారు.అందులో క్యారెక్టర్ లుక్, కాస్ట్యూమ్, VFX విషయంలో కొంత క్లారిటీ ఇచ్చినప్పటికీ, పూర్తి వివరాలు మాత్రం నవంబర్‌లో ప్రకటిస్తామని చెప్పారు.
ఈ రెండుగురు దిగ్గజ దర్శకుల మధ్య సంబంధం కొత్త కాదు.RRR కోసం జరిగిన అవార్డు ఈవెంట్‌లో జేమ్స్ కామెరన్ – రాజమౌళి కలుసుకున్నారు.ఆ సమయంలో RRR గురించి కామెరన్ ప్రశంసల వర్షం కురిపించారు.”మీరు ఎప్పుడైనా హాలీవుడ్‌లో సినిమా తీయాలనుకుంటే మాతో మాట్లాడండి” అని కామెరన్ చెప్పిన మాటలు అప్పట్లో ట్రెండ్ అయ్యాయి.అప్పుడు మొదలైన పరిచయం ఇప్పుడు SSMB 29 ప్రమోషన్‌కి ఉపయోగపడుతోంది.ఈసారి జేమ్స్ కామెరన్ చేతుల మీదుగా టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే, ఈ సినిమా ఇంతకుముందే ఇంటర్నేషనల్ హైప్‌ను సంపాదించనుంది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్‌లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్‌లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







