యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్..
- August 22, 2025
న్యూ ఢిల్లీ: యూపీఐ యూజర్లకు బిగ్ అలర్ట్.. యూపీఐ పేమెంట్లపై అనేక పరిమితులు అమల్లోకి వచ్చాయి. యూపీఐ ట్రాన్సాక్షన్లు చేసే యూజర్లు ఒకే రోజులో ఎక్కువ మొత్తం ట్రాన్సాక్షన్లు చేయలేరు. పరిమితికి లోబడి మాత్రమే యూపీఐ పేమెంట్లు చేయాల్సి ఉంటుంది.
సాధారణంగా ఒక వ్యక్తి యూపీఐ ద్వారా ఒక రోజులో రూ.1 లక్ష వరకు లావాదేవీలు చేయవచ్చు. కొన్ని బ్యాంకులు సైతం కొన్ని పరిమితులు విధించాయి. పన్ను పేమెంట్ ఐపీఓ ఆర్బీఐ రిటైల్ డైరెక్ట్ విద్యా సంస్థలు, ఆస్పత్రులు రోజుకు రూ. 5 లక్షల వరకు యూపీఐ పేమెంట్లు చేయొచ్చు.
ప్రస్తుత రోజుల్లో UPI (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్) అనేది టీ కోసం చెల్లించినా లేదా ఆన్‌లైన్ షాపింగ్ చేసినా కిరాణా సామాగ్రి కోసం ఇలా ప్రతిదీ యూపీఐ ద్వారా పేమెంట్లు చేస్తుంటాం. కానీ, యూపీఐ ద్వారా ఒక రోజులో ఎన్ని లావాదేవీలు చేయొచ్చు? ఎంత మొత్తం వరకు చేయవచ్చో అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
రోజుకు గరిష్ట పరిమితి ఎంత?
సాధారణంగా, ఎవరైనా UPI ద్వారా ఒక రోజులో రూ. లక్ష వరకు లావాదేవీలు చేయవచ్చు. ఈ పరిమితి P2P (వ్యక్తి నుంచి వ్యక్తికి) అంటే ఎవరికైనా డబ్బు పంపడం, P2M (వ్యక్తి నుంచి మర్చంట్) అంటే దుకాణదారుడికి డబ్బు ఇవ్వడం రెండింటికీ వర్తిస్తుంది. అయితే, ఈ పరిమితిని మించితే ఛార్జీలు తగ్గడం కన్నా పరిమితికి మించి ఎక్కువ లావాదేవీలు చేసినప్పుడు మాత్రం ఆటోమాటిక్‌గా ప్రాసెస్ ఆగిపోతుంది.
పేమెంట్ల పై లిమిట్ ఉందా?
కొన్ని బ్యాంకులు ఎన్ని పేమెంట్లు చేయాలి అనేదానిపై కూడా పరిమితులు విధించాయి. SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) వెబ్‌సైట్ ప్రకారం.. ఒక రోజులో గరిష్టంగా 20 లావాదేవీలు చేయొచ్చు. కానీ, P2P ట్రాన్సాక్షన్లకు మాత్రమే వర్తిస్తుంది.
P2M చెల్లింపులపై (షాపింగ్, బిల్ చెల్లింపులు వంటివి) ఎలాంటి పరిమితి లేదు. HDFC బ్యాంక్ కూడా ఇదే పరిమితులను విధించింది. రూ. లక్ష లేదా 20 లావాదేవీలు ఏది ముందుగా పూర్తయితే అది వర్తిస్తుంది.
రూ.లక్ష కన్నా ఎక్కువ పేమెంట్లు చేయలేమా?
కొన్ని కేటగిరీలలో RBI అధిక పరిమితులను ఇచ్చింది. పన్ను చెల్లింపులు, IPO, RBI రిటైల్ డైరెక్ట్, విద్యా సంస్థలు, ఆసుపత్రులకు రోజుకు రూ. 5 లక్షలు వరకు యూపీఐ పేమెంట్లు చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ పేమెంట్లు, రుణ చెల్లింపులు, బీమా, క్యాపిటల్ మార్కెట్లు, విదేశీ చెల్లింపులు రోజుకు రూ.2 లక్షలు వరకు పరిమితులు ఉంటాయి.
కొత్త యూపీఐ యూజర్లకు నిబంధనలు:
మీరు HDFC వంటి బ్యాంకులో కొత్త UPI యూజర్ అయితే.. “కూలింగ్ ఆఫ్ పీరియడ్” వర్తిస్తుంది. ఆండ్రాయిడ్ యూజర్లు మొదటి 24 గంటల్లో రూ.5వేల వరకు మాత్రమే పంపగలరు. ఐఫోన్ యూజర్లు ఈ పరిమితి మొదటి 72 గంటలు మాత్రమే వర్తిస్తుందని గమనించాలి.
యూపీఐ లైట్ లిమిట్:
యూపీఐ లైట్ చిన్నమొత్తాల్లో పేమెంట్లకు అందుబాటులో ఉంది. మీరు ఒకేసారి రూ. వెయ్యి వరకు పంపవచ్చు. రోజంతా మీ వ్యాలెట్‌కు రూ. 4వేల వరకు లోడ్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా వ్యాలెట్‌లో మొత్తం రూ.5వేలు గరిష్టంగా ఉంచుకోవచ్చు.
UPI123 పేమెంట్ లిమిట్:
యూపీఐలో (UPI123Pay) అనేది స్మార్ట్‌ఫోన్ లేదా ఇంటర్నెట్ లేని వారికోసం ఈ సర్వీసు అందుబాటులో ఉంది. ప్రతి లావాదేవీకి పరిమితి రూ. 10వేలు ఉంటుంది. ఈ పేమెంట్ IVR కాల్, మిస్డ్ కాల్, ఫీచర్ ఫోన్ యాప్ లేదా సౌండ్ ఆధారిత టెక్నాలజీ ద్వారా చేయవచ్చు.
తాజా వార్తలు
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్‌లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్