85 కిలోలకు పైగా మాదకద్రవ్యాలు సీజ్..ఇద్దరు అరెస్టు
- August 23, 2025
మస్కట్: అంతర్జాతీయ మాదకద్రవ్య అక్రమ రవాణా నెట్‌వర్క్‌లతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఫర్ కాంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కచ్చితమైన పర్యవేక్షణ మరియు ట్రాకింగ్ ఆపరేషన్ ద్వారా డ్రగ్ నెట్ వర్క్ ను ఛేదించినట్టు తెలిపింది.
అనుమానితుల వద్ద 85 కిలోగ్రాములకు పైగా హషీష్, గంజాయి, అలాగే 70,000 సైకోట్రోపిక్ మాత్రలను సీజ్ చేసినట్టు వెల్లడించింది. మాదకద్రవ్యాలను ఖురియాత్ తీరం వెంబడి ఒక ప్రదేశంలో దాచిపెట్టి, వాహనంలో తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొంది. అరెస్టయిన వారిపై చట్టపరమైన ప్రక్రియలు కొనసాగుతున్నాయని డైరెక్టరేట్ తెలిపింది.
తాజా వార్తలు
- MoCI సింగిల్ విండో ఇ-సేవలు విస్తరణ..!!
- సోషల్ మీడియా క్రియేటర్స్ కోసం Dh5 మిలియన్ల ఫండ్..!!
- కువైట్లో న్యూబర్న్స్ కు సివిల్ ఐడి జారీ గడువు పొడిగింపు..!!
- ముసందమ్ గవర్నరేట్లో ఖసాబ్ ఆసుపత్రి ప్రారంభం..!!
- జెద్దాలో 1,011 భవనాలకు నోటీసులు జారీ..!!
- 2026ను "ఇసా ది గ్రేట్ ఇయర్"గా ప్రకటించిన కింగ్ హమద్..!!
- తొలి వన్డేలో న్యూజిలాండ్ పై భారత్ విజయం
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ







