విజేతలకు సర్టిఫికేట్స్ అందించిన ఒమన్‌లో భారత రాయబారి..!!
- August 25, 2025
మస్కట్: భారత 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కళా పోటీలో విజేతలకు బహుమతులు, సర్టిఫికేట్లను అందించడానికి ఒక ప్రత్యేక వేడుకను నిర్వహించారు. ఒమన్‌లో భారత రాయబారి జివి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు.
షా నాగర్‌దాస్, ఖిమ్జీ రాందాస్ గ్రూప్ మరియు లులు ఎక్స్ఛేంజ్ మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమంలో 4-8 సంవత్సరాలు, 9-11 సంవత్సరాలు మరియు 12-14 సంవత్సరాల వయస్సు విభాగాలలో పోటీలు నిర్వహించారు. భారతదేశం పట్ల తమ ప్రేమను కళ ద్వారా ప్రదర్శించారు. డెలీషియస్ డ్యాన్స్ అకాడమీ మరియు కింగ్స్ యునైటెడ్ మస్కట్ నుండి ప్రతిభావంతులైన విద్యార్థులు నృత్య ప్రదర్శనలను ప్రదర్శించారు. ఈ పోటీలు, సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమం ఒమన్ - భారతదేశం మధ్య కళ, సంస్కృతి మరియు సమాజంలో విలువలను పెంపొదిస్తుందని, సహకార స్ఫూర్తిని బలోపేతం చేస్తుందని వక్తలు అన్నారు.
తాజా వార్తలు
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్ విజయం తర్వాత ప్రధాని మోదీని కలిసిన రామ్ చరణ్
- ఘనంగా ఫిలింఫేర్ అవార్డుల ప్రదానోత్సవం..
- పాపికొండల విహారయాత్ర రీస్టార్ట్
- తెలంగాణకు ఐకానిక్ గా టీస్క్వేర్ నిర్మాణం: సీఎం రేవంత్
- 2026 ఫిబ్రవరి నాటికి స్వదేశీ AI
- విజయవాడ-సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
- కొత్త యాప్ తో కల్తీ మద్యం గుట్టు రట్టు
- BHD 85.4 మిలియన్ల డీల్ కు అంగీకరించిన బహ్రెయిన్, కువైట్..!!
- జహ్రాలో ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు..డ్రగ్స్, గన్ స్వాధీనం..!!
- అమెరికా వార్ సెక్రెటరీతో ఖతార్ డిప్యూటి పీఎం సమావేశం..!!