ఇండియన్ ప్రాపర్టీ బయ్యర్స్ కు రియల్ నిపుణుల వార్నింగ్..!!

- August 25, 2025 , by Maagulf
ఇండియన్ ప్రాపర్టీ బయ్యర్స్ కు రియల్ నిపుణుల వార్నింగ్..!!

దుబాయ్: అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ఉపయోగించకుండా ఇండియన్ ప్రాపర్టీ బయ్యర్స్ ను రియల్ ఎస్టేట్ నిపుణులు హెచ్చరించారు. క్రెడిట్ కార్డ్ వాడకం షాపింగ్, ట్రావెల్ వంటి కరెంట్ ఖాతా లావాదేవీలకు మాత్రమే ఉద్దేశించబడిందని, కాబట్టి, ఏ రకమైన విదేశీ పెట్టుబడికైనా అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం అని రియల్ ఎస్టేట్ మరియు ట్యాక్స్ నిపుణులు తెలిపారు.

కొంతమంది భారతీయ కొనుగోలుదారులు అంతర్జాతీయ క్రెడిట్ కార్డుల ద్వారా దుబాయ్‌లో ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు నియంత్రణ సమస్యలను ఎదుర్కొన్నట్లు తెలిసిందని అండర్సన్ యూఏఈ CEO అనురాగ్ చతుర్వేది అన్నారు.  

ఇండియాలోని విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ప్రకారం, విదేశాలలో ఆస్తి కొనుగోళ్లను మూలధన ఖాతా లావాదేవీలుగా పరిగణిస్తారు. అయితే, అంతర్జాతీయ క్రెడిట్ కార్డులు (ICCలు) ప్రయాణం, షాపింగ్ మరియు విద్య సంబంధిత చెల్లింపులు వంటి కరెంట్ ఖాతా లావాదేవీలకు మాత్రమే అనుమతిస్తారు. విదేశాలలో రియల్ ఎస్టేట్ కోసం చెల్లించడానికి అంతర్జాతీయ క్రెడిట్ కార్డు బదులుగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆమోదించిన లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) ద్వారా భారతీయ నివాసితులు విదేశీ ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఏకైక చట్టపరమైన మార్గం అని చతుర్వేది అన్నారు.

లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ భారతీయ నివాసితులు అధీకృత బ్యాంకుల ద్వారా ఆర్థిక సంవత్సరానికి $250,000 వరకు చెల్లింపు చేయడానికి అనుమతిస్తుంది.  కొంతమంది డెవలపర్లు డౌన్ పేమెంట్‌లో కొంత భాగాన్ని రిజర్వ్‌గా ఉపయోగించడానికి అంగీకరిస్తున్నారని, ఆస్తి కొనుగోలుదారులకు చెల్లింపుల బదిలీని పూర్తి చేయడానికి ఎక్కువ సమయం ఇస్తుందన్నారు. ఇది సాధారణంగా Dh80,000 కంటే తక్కువగా ఉంటుందని పేర్కొన్నారు.

దుబాయ్‌లో ఆస్తి కొనుగోళ్లను పరిగణనలోకి తీసుకునే భారతీయ పెట్టుబడిదారులు భారతదేశ నియంత్రణ చట్రాన్ని పాటించాలని JSB ఇన్కార్పొరేషన్ CEO గౌరవ్ కేస్వానీ సూచించారు. రియల్ లావాదేవీల కోసం అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం, సౌకర్యవంతంగా అనిపించినప్పటికీ, ఫెమా మరియు LRS నిబంధనలకు అనుగుణంగా ఉండదని, ఈ కార్డులు కరెంట్ ఖాతా లావాదేవీల కోసం మాత్రమే ఉపయోగించాలని ఆయన సూచించారు. 

RBI మార్గదర్శకాల ప్రకారం, విదేశీ ఆస్తికి చెల్లింపులు $250,000 LRS పరిమితి కింద అధీకృత బ్యాంకుల ద్వారా చెల్లించాలని, సరైన డాక్యుమెంటేషన్ మరియు కనీసం ఒక సంవత్సరం పాటు బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలని ఆయన అన్నారు. విదేశాలలో ఆస్తి కొనుగోళ్లకు అంతర్జాతీయ క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వలన ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థల నుంచి వేధింపులు, జరిమానాలు వంటి చట్టపరమైన,  ఆర్థిక పరిణామాలు సంభవించవచ్చని హెచ్చరించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com