ఖైరతాబాద్ మహాగణపతి రెడీ..
- August 25, 2025
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ మహా గణనాథుడు తుది మెరుగులు దిద్దుకుంటున్నాడు. ఖైరతాబాద్‌లో 71 సంవత్సరాలుగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ సారి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు ఖైరతాబాద్ గణపతి.గణపతికి ఎడమ వైపు లలిత త్రిపుర సుందరి, గజ్జలమ్మ అమ్మవారి విగ్రహాలు.. కుడి వైపు లక్ష్మి, పార్వతి విగ్రహాలు ఉంటాయి.
ఈ సారి ప్రపంచ శాంతిని దేశ సమగ్రతను కాపాడాలన్న ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 69 అడుగుల ఎత్తులో ఈ సారి ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమిస్తున్నాడు.
ఈ విగ్రహ తయారీలో 150 మంది కళాకారులు పాల్గొన్నారు.పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని మట్టితో విగ్రహాన్ని రూపుద్దిద్దారు.అలాగే, సహజ సిద్ధమైన రంగులనే వాడారు.
తాజా వార్తలు
- ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారు..
- ఏపీ: గ్రంధాలయాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
- రూ.7.88 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు
- NRT కమ్యూనిటీ సమస్యల పై ప్రత్యేక దృష్టి
- తెలంగాణలో కరెంట్ కు భారీ డిమాండ్
- పోర్చుగల్‌తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!