మిషన్ కాకతీయ పనులను చూసేందుకు తెలంగాణకు వస్తా: ఉమా భారతి
- July 18, 2016
తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఇవాళ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కేంద్ర మంత్రి ఉమాభారతిని కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోన్న మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలను గురించి వివరించారు. వీటిని పరిశీలించేందుకు రాష్ర్టానికి రావాలని ఆహ్వానించారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నీటిపారుదల విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు బాగున్నాయని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు మిషన్ కాకతీయ పనులను చూసేందుకు త్వరలో తాను తెలంగాణకు రానున్నట్టు వెల్లడించారు.మిషన్ కాకతీయ ప్రయోగం దేశం మొత్తానికే ఆదర్శమని అన్నారు. తమ శాఖకు కూడా సహకరించాలని సీఎం కేసీఆర్‌ను కోరానని వివరించారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలు మిగతా రాష్ర్టాల్లో అమలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రిని కేంద్ర టాస్క్‌ఫోర్స్‌లో పెట్టామని తెలిపారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







