గాజా దిగ్బంధనను ఆపండి.. సౌదీ అరేబియా పిలుపు..!!
- August 26, 2025
రియాద్: గాజాపై దిగ్బంధనను ఆపాలని, ప్రపంచ దేశాల మానవతా సహాయాన్ని అడ్డంకులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ పిలుపునిచ్చారు. జెడ్డాలో దాని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) విదేశాంగ మంత్రుల మండలి 21వ అసాధారణ సమావేశంలో ఆయన ప్రసంగించారు. పాలస్తీనా ప్రజలు ప్రస్తుతం ఇజ్రాయెల్ దురాక్రమణ ఫలితంగా అత్యంత దారుణమైన అణచివేతకు, మారణహోమానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఇజ్రాయెట్ అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘిస్తోందని అన్నారు.
పాలస్తీనియన్లపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ దురాక్రమణ పరిణామాలను చర్చించడానికి OIC దేశాలు సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇటీవల చేసిన "గ్రేటర్ ఇజ్రాయెల్ విజన్" ప్రకటనలను సమావేశం తీవ్రంగా ఖండించింది. పాలస్తీనాలో కొనసాగుతున్న ఉల్లంఘనలు శాంతిని అడ్డుకుంటాయని.. ఇలాంటి చర్యలు ప్రాంతీయంగా మరియు అంతర్జాతీయంగా మరింత అశాంతికి కారణమవుతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
పాలస్తీనియన్ల సమస్య పరిష్కారానికి సౌదీ అరేబియా కట్టుబడి ఉందని, జూన్ 4, 1967న తూర్పు జెరూసలేం రాజధానిగా స్వతంత్ర పాలస్తీనాను ఏర్పాటు చేయాలని సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ మరోసారి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అమెరికా మరో వీసా షాక్
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!







