విజయవాడ దుర్గగుడికి వెళ్లే భక్తులకు అలర్ట్..
- August 26, 2025
విజయవాడ: విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంకు వెళ్లే భక్తులకు అలర్ట్. ఇకపై ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు ఆలయ నిర్వాహకులు కొత్త రూల్స్ అమలు చేయనున్నారు. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయని తెలిపారు.
ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు కొత్తగా డ్రెస్ కోడ్ అమలు చేయనున్నారు. దుర్గగుడికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులే ధరించాలని, లేకపోతే వారిని ఆలయంలోకి అనుమతించబోమని ఆలయ ఈవో వీకే శీనా నాయక్ అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఈ కొత్త నిబంధన సెప్టెంబర్ 27వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని చెప్పారు.
తాజా నిర్ణయంతో.. సెప్టెంబర్ 27వ తేదీ నుంచి భక్తులతోపాటు ఆలయ సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించడం తప్పనిసరి కానుంది. విధుల్లో ఉండే సమయంలో ఆలయ ఉద్యోగులు కచ్చితంగా ఐడీ కార్డులు ధరించాలని, అలాగే స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్ వద్ద కఠిన తనిఖీలు చేయాలని ఈవో వీకే శీనా నాయక్ పేర్కొన్నారు. దుర్గ గుడిలో సేవ, దర్శనాలతో పాటు వసతి సదుపాయాలు కోసం https://kanakadurgamma.org/en-in/home వెబ్సైట్ సందర్శించాలని ఆలయ అధికారులు సూచించారు.
ఆలయ నిర్వాహకులు కొత్త రూల్ అమల్లోకి తీసుకురావడం వెనుక పెద్ద కారణమే ఉంది. దుర్గగుడికి భక్తులు అభ్యంతరకర దుస్తుల్లో వస్తుండటంతో పాటు, ఆలయం లోపల వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఘటనలు ఇటీవల ఆలయ అధికారులు గుర్తించారు.
తాజా వార్తలు
- పోర్చుగల్తో ఆర్థిక, పెట్టుబడి సహకారం..కువైట్
- సలాలాలో 'వాయిస్ ఆఫ్ ది సీజన్ 2025' ప్రారంభం..!!
- రియాద్ సీజన్ 2025 అద్భుతమైన గ్లోబల్ పరేడ్ తో ప్రారంభం..!!
- అల్ ఐన్లో ఫుడ్ పాయిజనింగ్..బేకరీ మూసివేత..!!
- అక్టోబర్ 13న కతారా పుస్తక ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగంపై నిబంధనలు కఠినతరం..!!
- దుబాయ్ లో అక్టోబర్ 12న FOI ఈవెంట్స్ దీపావళి ఉత్సవ్
- ఏపీ: నకిలీ మద్యం కేసు..రహస్య ప్రదేశంలో కింగ్ పిన్ విచారణ..
- ఐపీఎల్ మినీ వేలానికి ముహూర్తం ఫిక్స్
- భారత్లో 9 బ్రిటన్ యూనివర్శిటీల క్యాంపస్