ఉచిత బస్‌ పాస్‌ పథకాన్ని ప్రారంభించిన జయలలిత

- July 18, 2016 , by Maagulf
ఉచిత బస్‌ పాస్‌ పథకాన్ని ప్రారంభించిన జయలలిత

తమిళనాడు ప్రభుత్వం 2016-17 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులకు ఉచిత బస్‌ పాస్‌ పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సోమవారం చెన్నై సెక్రటేరియట్‌లో ఐదుగురు విద్యార్థులకు స్మార్ట్‌ కార్డు బస్‌పాస్‌లు అందజేశారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన ఈ పథకంలో 2015-16 సంవత్సరంలో సుమారు 28.05 లక్షల విద్యార్థులు లబ్ధి పొందిగా, ఈ సంవత్సరం దాదాపు 31.11లక్షల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌కార్డు బస్‌ పాస్‌లు అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికి గాను రూ.504.31 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది.

దీంతో పాటుగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన ఆర్కేనగర్‌లో పెన్షన్‌ పథకాన్ని ప్రారంభిస్తూ జయలలిత మరో ఐదుగురికి పెన్షన్‌ అందించారు. ఈ పథకం ద్వారా ఆగస్టు నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున 1248మంది లబ్ధి పొందనున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com