ఐడియా వారి బంపర్ ఆఫర్...
- July 18, 2016
ఐడియా నెట్వర్క్ వినియోగదారులకు వారంలోనే వరుసగా రెండోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ అందిస్తున్న 4జి, 3జి మొబైట్ ఇంటర్నెట్ ప్యాక్ ధరలపై 67 శాతం తగ్గింపును ప్రకటించింది. తన పోటీదారులు భారతి ఎయిర్ టెల్, రిలయన్స్ జియో తో పోల్చితే భారీగా తగ్గింపును ఐడియా ప్రకటించింది. రెండు రోజుల క్రితం 1జిబి కన్నా తక్కువ ప్యాక్స్ పై ధరలో 45 శాతం తగ్గింపు విధిస్తున్నట్లు ప్రకటించిన కంపెనీ... తాజాగా అత్యధికంగా ఇంటర్నెట్ వాడే 2జిబి నుంచి 10 జిబి ప్యాక్స్ కలిగిన వినియోగదారులకు 67 శాతం ధరలు తగ్గిస్తున్నట్లు ఐడియా ఓ ప్రకటనలో తెలిపింది.ప్రీపెయిడ్ 3జి, 4జి కస్టమర్లకోసం భారతి ఎయిర్ టెల్ 67 శాతం ధరలు తగ్గించడంతో.. ఐడియా ఒకే వారంలో రెండోసారి ధరల తగ్గింపును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఐడియా 10 జిబి 4జి, 3జి ఇంటర్నెట్ ప్యాక్స్ ను కేవలం 990 రూయాయలకే అందిస్తోంది. అలాగే ఇంతకు ముందు 449 రూపాయలుండే 2జిబి డేటాను 349 రూపాయలకు అందిస్తోంది. ప్రస్తుత 67 శాతం భారీ తగ్గింపులతో ఐడియా కస్టమర్లు ఇంతకు ముందు 3జి డేటా ధరలకు దగ్గరగా 5జిబి 4జి, 3జి డేటా ప్యాక్ లకు 649 రూపాయలకే పొందే అవకాశం లభిస్తోంది. ఈ నూతన టారిఫ్ ను ప్రీ పెయిడ్ వినియోగదారులు 4జి, 3జి ప్రొవైడర్లద్వారా వెంటనే పొందవచ్చని ఐడియా వెల్లడించింది. రిలయన్స్ జియో అతి తక్కువ రేటుకు ఇంటర్నెట్ ప్యాక్స్ ను అందిస్తుండటంతో మిగిలిన అన్ని టెలికాం కంపెనీలు ధరలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







