ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రారంభించిన జయలలిత
- July 18, 2016
తమిళనాడు ప్రభుత్వం 2016-17 విద్యా సంవత్సరానికిగాను విద్యార్థులకు ఉచిత బస్ పాస్ పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత సోమవారం చెన్నై సెక్రటేరియట్లో ఐదుగురు విద్యార్థులకు స్మార్ట్ కార్డు బస్‌పాస్‌లు అందజేశారు. పేద విద్యార్థుల కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన ఈ పథకంలో 2015-16 సంవత్సరంలో సుమారు 28.05 లక్షల విద్యార్థులు లబ్ధి పొందిగా, ఈ సంవత్సరం దాదాపు 31.11లక్షల విద్యార్థులకు ఉచిత స్మార్ట్‌కార్డు బస్ పాస్‌లు అందించేందుకు సిద్ధమవుతోంది. దీనికి గాను రూ.504.31 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తోంది.
దీంతో పాటుగా ముఖ్యమంత్రి నియోజకవర్గమైన ఆర్కేనగర్లో పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తూ జయలలిత మరో ఐదుగురికి పెన్షన్ అందించారు. ఈ పథకం ద్వారా ఆగస్టు నుంచి నెలకు రూ.వెయ్యి చొప్పున 1248మంది లబ్ధి పొందనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







