దుబాయ్‌లో 'ప్రవాసీ' సంఘాలపై కఠిన చర్యలు
- July 18, 2016
గల్ఫ్ దేశాలలో ఇటీవల పుట్టుకొస్తున్న అనేక ‘ప్రవాసీ సంఘాల’ కార్యకలాపాలపై గల్ఫ్‌దేశాల అధికారులు సమాచారం సేకరిస్తున్నారు. జన సమీకరణ, సంఘాల సమావేశాలు, ప్రసంగాలపై ప్రభుత్వ డేగకన్ను సారించింది. ప్రవాసుల సంస్కృతి, సంక్షేమం అంటూ పుట్టుకొస్తున్న సంఘాలు ప్రాథమిక చట్టాలను ఉల్లంఘిస్తున్నందున అధికారులు దృష్టి సారించారు. దుబాయిలో మౌనంగా ఉంటూ తెలుగు రాష్ట్రాలలో సంఘాలంటూ సోషల్ మీడియా, పత్రికలలో దర్శనమిచ్చేవారి సంఖ్య కూడా ఇటీవల గణనీయంగా తగ్గడానికి అధికారుల కట్టుబాట్లు కారణమని విశ్వసనీయ సమాచారం. భారత్ ఎంబసీల ఆవరణలోనైనా ఏదైనా సంఘం సమావేశం నిర్వహించాలంటే 40రోజుల ముందు అనుమతి పొందడంతోపాటు కార్యకలాపాల పూర్తి వివరాలు అందజేయాలని గల్ఫ్ అధికారులు సూచిస్తున్నారు. సంఘ కార్యవర్గ సభ్యుల రెసిడెన్సీ వీసా, భారత పాస్‌పోర్టు వివరాలను విధిగా సమర్పించాలని ఆదేశిస్తున్నారు. ఎక్కడయినా వీరు నోరు జారితే ఆ వివరాల ఆధారంగా అరెస్టుకు అవకాశం ఉంటుంది. మొత్తం గల్ఫ్ ప్రాంతంలో ఉదార, సరళీకృత నిబంధనలున్న దుబాయ్‌లో దీన్ని పటిష్ఠంగా అమలుచేస్తున్నారు. దుబాయ్ ప్రభుత్వ ఆధ్వ ర్యంలోని సీడీఏ ఆధ్వర్యంలో దుబాయ్‌లో పనిచేస్తున్న ప్రవాస భారతీయ సంఘాలన్నీ విధిగా నమోదు చేసుకోవాలని, నమోదు చేసుకోకుండా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించరాదని హెచ్చరిస్తున్నారు. దుబాయిలో సంఘం నాయకులుగా తెలుగు రాష్ట్రాలలో చలామణి అవుతున్న కొందర్ని పిలిపించి హెచ్చరించారు. సోషల్ మీడియాలో క్రియాశీలంగా ఉన్నవారి వివరాలు సేకరించడమే కాకుండా తెలుగుసహా ఇతర భారతీయ భాషల నుంచి అరబ్బీ భాషలోకి వీరి ప్రకటనలు, ఇతర సమాచారాన్ని అనువదిస్తున్నారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







