20 ఏళ్ల వారసత్వ వివాదానికి తెరదించిన దుబాయ్ కోర్టు..!!

- August 28, 2025 , by Maagulf
20 ఏళ్ల వారసత్వ వివాదానికి తెరదించిన దుబాయ్ కోర్టు..!!

యూఏఈ: దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వారసతవ వివాదానికి దుబాయ్ కోర్టు ముగింపు పలికింది.  ఎస్టేట్ ఆస్తుల నుండి Dh34 మిలియన్లను సొంత అవసరాలకు వినియోగించుకున్న కుటుంబ వారసుడిని దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తుది తీర్పును దుబాయ్ కోర్ట్ ఆఫ్ కాసేషన్ సమర్థించింది.

కుటుంబ పెద్ద మరణం తర్వాత ఈ కేసు 2006 నాటిది. ఒక వారసుడు కుటుంబం హోల్డింగ్ గ్రూప్ మరియు రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. తరువాత జరిగిన ఆర్థిక సమీక్షలో Dh34 మిలియన్ల (సుమారు 9.2 మిలియన్ US డాలర్లు) లోటు బయటపడింది.

వారసుడు ఎస్టేట్ ఆస్తులపై వ్యక్తిగత రుణాలు తీసుకున్నాడని, వ్యక్తిగత లాభం కోసం ఆస్తులను కొనుగోలు చేయడం, అమ్మడంలో నిమగ్నమై ఉన్నాడని, వెల్లడించని జాయింట్ వెంచర్లలోకి ప్రవేశించాడని, ఇతర వారసులకు తెలియజేయకుండా లేదా లాభాలను పంపిణీ చేయకుండా రియల్ ఎస్టేట్ లావాదేవీల నుండి కమీషన్లు సేకరించాడని కోర్టు రికార్డులు వెల్లడించాయి.

కోర్టు నియమించిన స్వతంత్ర ఆడిట్ టీమ్ కూడా దీనిని నిర్ధారించింది. దుబాయ్ కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్‌స్టాన్స్ వారసుడిని నమ్మక ద్రోహం, దుర్వినియోగానికి పాల్పడినట్లు నిర్ధారించింది.  తరువాత ఈ తీర్పును అప్పీల్ కోర్ట్ మరియు కాసేషన్ కోర్ట్ రెండూ సమర్థించాయి. ఎస్టేట్‌ను కాపాడటానికి, కేసు సమీక్షలో ఉన్నప్పుడు ఆస్తులను పర్యవేక్షించడానికి మరియు నిర్వహించడానికి కోర్టు ఒక కస్టోడియన్‌ను నియమించిందని రికార్డులను సమీక్షించిన రెసిలిస్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అండ్ అడ్వైజరీ సర్వీసెస్‌లో సీనియర్ పార్టనర్ - అడ్వైజరీ ఖలీద్ ఫరూక్  తెలిపారు. కుటుంబ వ్యాపారాలలో కార్పొరేట్ పాలన ప్రాముఖ్యతను ఈ కేసు హైలైట్ చేసిందని అన్నారు. వివాదాలను నివారించడానికి రెగ్యులర్ ఆడిట్‌లు, స్పష్టమైన విధానాలు చాలా అవసరం అని పేర్కొన్నారు.   

2023లో దుబాయ్ స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ Dh4.1 బిలియన్లకు పైగా విలువైన వారసత్వ కేసులను పరిష్కరించింది. కోర్టు 512 ముస్లిం ఎస్టేట్‌లు, 38 ముస్లింయేతర ఎస్టేట్‌లు మరియు 30 ప్రైవేట్ ఎస్టేట్‌లతో సహా 580 కేసులను విచారించింది. వారసత్వ కేసుల్లో పరిష్కారాల సక్సెస్ రేటు 92.6 శాతానికి చేరుకుంది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com