యూఏఈలోని స్కూళ్లకు APAAR ID నుండి CBSE మినహాయింపు..!!

- August 29, 2025 , by Maagulf
యూఏఈలోని స్కూళ్లకు APAAR ID నుండి CBSE మినహాయింపు..!!

యూఏఈ: యూఏఈలోని CBSE అనుబంధ పాఠశాలలు ఇకపై APAAR IDలను రూపొందించాల్సిన అవసరం లేదు. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ప్రధానోపాధ్యాయులకు పంపిన సర్క్యులర్‌లో స్పష్టం చేసింది. విదేశాలలో ఉన్న పాఠశాలలు వివిధ పరిపాలనా కారణాలు మరియు చట్టాల కారణంగా APAAR నుండి మినహాయించపు ఇచ్చినట్లు పేర్కొంది.  

APAAR, లేదా ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ, విద్యార్థుల నమోదుకు అనుసంధానించబడిన ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య. ఇది కొత్త విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు విద్యార్థి ప్రయాణాన్ని ట్రాక్ చేయడానికి భారత అధికారులను అనుమతిస్తుంది.  

ఈ నెల ప్రారంభంలో CBSE భారతదేశంలో 10 మరియు 12 తరగతుల బోర్డు పరీక్షలకు నమోదు చేసుకునే విద్యార్థులకు APAAR IDలను తప్పనిసరి చేసింది. APAAR ID నమోదుకు విద్యార్థులు పేరు, వయస్సు, పుట్టిన తేదీ, ఆధార్ నంబర్ వంటి వివరాలను సమర్పించాలి.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com