చంద్రముఖి సినిమాకు సీక్వల్ లో లారెన్స్.
- July 18, 2016
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన పాత్రలో మరో నటుడు కనిపించాలని నిర్ణయించుకోవటం సాహసమే. అయితే ఆ సాహసానికి రెడీ అవుతున్నాడు కొరియోగ్రాఫర్, డైరెక్టర్, హీరో లారెన్స్. ఇటీవల వరుసగా హర్రర్ సినిమాలతో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను భయపెడుతున్న లారెన్స్ ప్రస్తుతం పటాస్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతున్న మొట్ట శివ సినిమాలో నటిస్తున్నాడు.ఈ సినిమా తరువాత మరోసారి తనకు బాగా కలిసొచ్చిన హర్రర్ జానర్ లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటి వరకు తన దర్శకత్వంలోనే హర్రర్ సినిమాలు చేసిన లారెన్స్, ఈ సారి చంద్రముఖి ఫేం పి.వాసు దర్శకత్వంలో నటిస్తున్నాడు. చంద్రముఖి సినిమాకు సీక్వల్ గా తెరకెక్కుతున్న ఈసినిమాను ముందుగా రజనీతోనే చేయాలని భావించినా.., రజనీకాంత్ ఇంట్రస్ట్ చూపించకపోవటంతో లారెన్స్ కు ఫిక్స్ అయ్యారు. అనుష్క హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







