భారత్ లో రష్యా యుద్ధ విమానాలు
- September 02, 2025
రష్యా: పహల్గాంలో ఉగ్రదాడితో భారతదేశం పాకిస్తాన్లో ‘ఆపరేషన్ సిందూర్’ యుద్ధాన్ని చేసింది. భారత్ దాడితో పాక్ తోకముడిచి కాల్పుల విరమణకు దిగొచ్చింది. అంతేకాదు పాకిస్తాన్ రక్షణ వ్యవస్థను మరింత మెరుగుపరుచుకునేందుకు అధిక నిధులను కేటాయిస్తున్నది. దీంతో భారతదేశం కోసం అధునాతన రక్షణ ఆయుధాలను సమకూర్చుకుంటున్నది. ఇందులో భాగంగా భారత్ రష్యాతో యుద్ధ విమానాలకు సంబంధించిన కొత్త ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇటీవల రష్యా, భారత్ మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. చైనాలో జరిగిన ఎస్సీవో సమావేశంలో ఈ ఫ్రెండ్లిప్ మరింత బలపడింది. రెండు దేశాలూ ఇప్పటికే చమురుతో పాటూ మరికొన్ని వాణిజ్యం చేస్తున్నాయి. రష్యా భారతదేశంలో సుఖోయ్ యుద్ధ విమానాలను తయారు చేయనుంది. రష్యా ఐదవతరం ఫైటర్ జెట్ సుఖోయ్‌లు ఇక మీదట భారత్ లో తయారు కానున్నాయి. ఇవి రష్యాతో పాటూ భారత్ కూడా తమ సైన్యంలో ఉపయోగించనున్నాయి. ఇవి అమెరికా ఎఫ్ 35 జెట్ ఫైటర్లతో సమానమైనవని తెలుస్తోంది. ఇప్పటికే భారత్ సైన్యంలో ఎఫ్ 35 యుద్ధ విమానాలు ఉన్నాయి. వాటికి తోడు రష్యా సుఖోయ్ జెట్లు కూడా చేరితే పాక్‌కు ఇక గడ్డుకాలమే.
భారతదేశంలో యుద్ధ విమానాలను తయారు చేయడానికి రష్యా పరిశోధన ప్రారంభించింది. హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇప్పటికే నాసిక్ ప్లాంట్‌లో రష్యాన్ మూలానికి చెందిన సుఖ్-30 ఎంకేఐ యుద్ధ విమానాలకు లైసెన్స్ ఇచ్చింది. ఇప్పుడు సుఖ్-57 కూడా వాడొచ్చు. ప్రస్తుతం ఎంకే 1, ఎంకె1తో సహా తేజస్ ఫైటర్ జెట్లను భారతదేశంలో తయారు చేస్తున్నారు. ఎంకే-1 ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్ ఆధునిక ఆయుధాలతో అమర్చబడి ఉంది. ఇక ఎంకే-2 అయితే బహుళ-ప్రయోజన యుద్ధ జెట్. ఇది ఎంకే-1కు నెక్స్ట్ వెర్షన్.ఇప్పుడు వీటన్నింటి తోడు సుఖ్-57 కూడా త్వరలోనే భారత్ తో తయారు చేస్తారని తెలుస్తోంది. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే.. భారత్ ఒక్క అమెరికానే నమ్మకోకుండా ఇలా మిగతా దేశాలతో తమ సంబంధాలను మెరుగుపర్చుకోవడం శుభపరిణామం. ఎందుకంటే ట్రంప్ భారత్ ఆర్థికంగా దెబ్బకొట్టాలని యత్నిస్తున్నారు. అధిక టారిఫ్‌లను విధిస్తూ, భారతీయ విద్యార్థులను రానియ్యకుండా అడ్డుకుంటున్నారు. ఈ స్థితిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగానే మోదీ జపాన్, చైనా దేశాలలో పర్యటించారు.
తాజా వార్తలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!







