హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- August 05, 2026
అబుదాబి: యూఏఈలో వేసవి తీవ్రత కారణంగా ఎండలో పార్క్ చేసిన కారు లోపలి ఉష్ణోగ్రత కొద్ది నిమిషాల్లోనే 60 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువకు చేరుకునే ప్రమాదం ఉందని రహదారి భద్రత, వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితులు చర్మం కాలిపోవడం, హీట్ ఎగ్జాస్షన్‌కు గురికావడం మాత్రమే కాకుండా, డ్రైవింగ్ సమయంలో ఏకాగ్రత తగ్గి ప్రమాదాల ముప్పు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.
తీవ్రమైన వేడి కారణంగా డ్రైవర్ల ఏకాగ్రత, స్పందన వేగం తగ్గిపోతుందని రోడ్‌హీరో అకాడమీ వ్యవస్థాపకుడు ముస్తఫా అల్‌దా చెప్పారు. శరీర ఉష్ణోగ్రత పెరగడంతో అలసట, నీరసం, తలనొప్పి, వికారం వంటి సమస్యలు తలెత్తి సురక్షితంగా వాహనం నడపడం కష్టమవుతుందని వివరించారు.
ఎండలో వేడెక్కిన కారులోకి ఎక్కగానే శరీరం తన సహజ శీతలీకరణ వ్యవస్థపై అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుంది. అధిక చెమట పట్టడం వల్ల శరీరంలో నీటి శాతం వేగంగా తగ్గి డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. సమయానికి జాగ్రత్తలు తీసుకోకపోతే హీట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందని, అది ప్రాణాపాయానికి కూడా దారితీయవచ్చని డాక్టర్ జారా హెచ్చరించారు.
వేసవిలో వాహనాల నిర్వహణపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరమని నిపుణులు సూచించారు. ప్రయాణానికి ముందు టైర్లలో గాలి ఒత్తిడి, ఇంజిన్ ఆయిల్, కూలెంట్, బ్యాటరీ, బెల్టులు, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను తప్పనిసరిగా తనిఖీ చేయాలని తెలిపారు. వాహనం నుంచి అసాధారణ శబ్దాలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.
చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్యంతో ఉన్నవారు, పెంపుడు జంతువులను ఎట్టి పరిస్థితుల్లోనూ పార్క్ చేసిన కారులో ఒంటరిగా వదిలి వెళ్లరాదని వైద్యులు స్పష్టం చేశారు. కారు ఇంజిన్ ఆన్‌లో ఉన్నప్పటికీ విద్యుత్ లోపాల వల్ల తలుపులు లాక్ అయ్యే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. తల తిరగడం, చూపు మసకబారడం, బలహీనత, వికారం, గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వాహనం ఆపి వైద్య సహాయం తీసుకోవాలని సూచించారు.
వేసవిలో వాహనదారులు నీడ ఉన్న ప్రదేశాల్లోనే కారును పార్క్ చేయడం, విండ్‌స్క్రీన్ సన్‌షేడ్ ఉపయోగించడం, కారులోకి ఎక్కే ముందు తలుపులు తెరిచి వేడి గాలిని బయటకు పంపించడం, క్యాబిన్ చల్లబడిన తర్వాతే ప్రయాణం ప్రారంభించడం, తగినంత నీరు తాగడం వంటి జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచించారు.
తాజా వార్తలు
- Asian Games 2026: మహిళల క్రికెట్లో భారత్‌కు తొలి స్వర్ణం!
- దుబాయ్-అబుదాబి రైలు టికెట్ల విక్రయాలు ప్రారంభం.. సెప్టెంబర్ 30 నుంచి సేవలు
- తీవ్ర ఒత్తిడిలో ప్రపంచం..విదేశాంగ మంత్రి జైశంకర్ ఆవేదన
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!







