స్ముగ్గ్లింగ్ కేసులో ఇద్దరు స్పైస్‌జెట్ ఉద్యోగులు అరెస్టు
- July 18, 2016
బంగారం అక్రమంగా రవాణా చేసే స్మగ్లర్లకు సాయం చేస్తున్న ఇద్దరు స్పైస్‌జెట్ ఉద్యోగులను మంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిఘా వర్గాల సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టగా.. దుబాయ్ నుంచి వచ్చిన ఓ అంతర్జాతీయ విమానంలో సీటు కింద దాచి ఉంచిన బంగారాన్ని గుర్తించారు. ఈ స్మగ్లింగ్‌కు స్పైస్ జెట్‌లో పనిచేసే ఇద్దరు సిబ్బంది సాయం చేస్తున్నట్లు తెలిసింది. దీంతో మంగళూరు ఎయిర్‌పోర్టులో పనిచేసే మహ్మద్ హనీఫ్, ముద్దయ్యలను పోలీసులు అరెస్టు చేసి విచారించారు.
విమానం ఎయిర్‌పోర్టుకి చేరుకోగానే.. అందులోని బంగారాన్ని సిబ్బంది తీసుకుని.. కస్టమ్స్ చెకింగ్‌ను తప్పించి విమానాశ్రయం బయటకు చేరుస్తారని పోలీసుల విచారణలో తేలింది. గతంలో ఆరు సార్లు కూడా ఇలా స్మగ్లర్లకు సాయం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఇందుకోసం వారు స్మగ్లర్ల నుంచి భారీగా డబ్బులు తీసుకున్నట్లు చెప్పారు. దీంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి 2.5కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బంగారం విలువ రూ.75.26లక్షలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై స్పైస్‌జెట్ స్పందిస్తూ.. ఆ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు తెలిపింది.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







