ఆన్ లైన్ షాపింగ్ పై స్మగ్లర్ల దృష్టి..
- July 18, 2016
ఆన్ లైన్ షాపింగ్.. దేశంలో రోజురోజుకూ మార్కెట్ ను పెంచుకుంటూ పోతున్న ఈ రంగంపై స్మగ్లర్ల దృష్టి పడింది. ఎవరైనా తమ షాపింగ్ వెబ్ సైట్లో సెల్లర్లుగా మారొచ్చనే ఆప్షన్ ను తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. స్వయంగా కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే రాజ్యసభలో ఈ విషయాన్ని తెలిపారు. దాదాపు 106 ఆన్ లైన్ షాపింగ్ సంస్థల్లో సెల్లర్లుగా మారిన స్మగ్లర్లు జంతువుల చర్మాలను అక్రమంగా రవాణా చేస్తున్నట్లు వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో (డబ్ల్యూసీసీబీ) గుర్తించినట్లు చెప్పారు.
ఆస్ట్రేలియాకు చెందిన కొఆలా , పులి తదితర జంతువుల చర్మాలను అక్రమంగా దేశంలోకి తెచ్చేందుకు ఆన్ లైన్ షాపింగ్ లో అమ్మకానికి పెడుతున్నారని చెప్పారు . సెల్లర్ల సంఖ్య వేలల్లో ఉండటం వల్ల వారిని పట్టుకోవడం కష్టమౌతోందని తెలిపారు . అమెజాన్ , ఈ - బే , ఓఎల్ఎక్స్ , స్నాప్ డీల్ తదితర ప్రముఖ వెబ్ సైట్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయని వివరించారు . అమెజాన్ , స్నాప్ డీల్ లాంటి సంస్థలకు సెల్లర్లపై పట్టుకలిగి ఉండటం వల్ల జంతువులకు సంబంధించిన బొమ్మలు , వస్తువులపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు .
కొద్దిరోజుల క్రితం ఓ ప్రముఖ వెబ్ సైట్ నుంచి ఆస్ట్రేలియన్ టెడ్డీ బేర్ ను రూ .2 లక్షలకు కొన్నట్లు ఓ అధికారి తెలిపారు . ఆస్ట్రేలియాకు చెందిన జంతువుల చర్మాన్ని టెడ్డీ బేర్ కు ఉంచి దీనిని అమ్మకానికి పెట్టినట్లు వివరించారు . ఇందుకోసం వారు ప్రత్యేకమైన కోడ్స్ ను ఉపయోగిస్తున్నారని గుర్తించినట్లు చెప్పారు . ఈ వివరాలను అన్ని ఆన్ లైన్ షాపింగ్ సంస్థలకు అందిచామని తెలిపారు .
ఈ ఏడాది మే నెలలో గుర్తుతెలియని సెల్లర్లు పోస్టు చేసిన దాదాపు 296 జంతు సంబంధిత వస్తువుల అమ్మకాలను అమెజాన్ నిలిపివేసిందని చెప్పారు . ఈ - బే , క్విక్కర్ తదితర సైట్లకు సెల్లర్ల మీద అవగాహన సరిగా ఉండటం లేదని , మరికొన్ని సంస్థలకు అసలు దేశంలో కార్యలయాలు లేవని తెలిపారు . ఆన్ లైన్ అక్రమంగా రవాణా చేస్తున్న వస్తువులపై నిఘాను పటిష్టం చేసినట్లు వివరించారు . సంరక్షణలో ఉన్న జంతువులు , పక్షులకు చెందిన వస్తువులను అమ్మకానికి ఉంచబోమని ఓఎల్ఎక్స్ అధికార ప్రతినిధి తెలిపారు .
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







