ఆగష్టు 15న ధ్రువ. ఫస్ట్ లుక్ రిలీజ్..
- July 18, 2016
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గ్లామర్ క్వీన్ రకుల్ ప్రీత్‌సింగ్ ప్రధాన పాత్రలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ధ్రువ. గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలే కశ్మీర్ షెడ్యూల్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం జూలై నెలాఖరు వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఆగష్టు లో సాంగ్స్ చిత్రీకరణ చేయనున్నారు. ఈ చిత్రంలో క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడు. చరణ్ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకున్నారు. విభిన్నమైన కథతో , ఆసక్తికరమైన కథాంశంతో రామ్ చరణ్, సురేందర్ రెడ్డి, అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ధృవ చిత్ర నిర్మాణం జరుగుతోంది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఫెర్‌ఫార్మెన్స్, రకూల్ ప్రీత్ సింగ్ అందచందాలు చిత్రానికి హైలెట్ గా నిలిస్తే, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మరో హైలైట్ గా నిలవనున్నాయి. ఆగష్టు 15న ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని నిర్మాత తెలుపగా, త్వరలో టీజర్ ని అక్టోబర్ లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







