డిగ్రీ ఉన్నవారికే శ్రీవారి సేవ!

- September 04, 2025 , by Maagulf
డిగ్రీ ఉన్నవారికే శ్రీవారి సేవ!

తిరుమల: ధార్మికసంస్థ తిరుమలలోని అన్ని విభాగాల్లో భక్తులకు ఇతోదిక సేవలం దిస్తున్న శ్రీవారిసేవకులు మరింత మెరుగైన సేవలందించే దిశగా శిక్షణ ఇస్తామని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. శ్రీవారిసేవ చేయాలనుకునే వారికి కనీసం డిగ్రీ విద్యార్హతగా  నిర్ణయించామని,వారికి తిరుమలలో మూడ రోజులు శిక్షణ ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించామన్నారు. ఒకరోజు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూచనలమేరకు తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి, బర్డ్, ఆయుర్వేద ఆస్పత్రుల్లో వైద్యసేవలకు వాలంటరీ సర్వీసెస్ను అమలు చేయనున్నట్లు చైర్మన్ నాయుడు వెల్లడించారు. బుధవారం సాయంత్రం తిరుమల అన్నమయ్యభవనంలో టిటిడి ఇఒశ్యామలరావు, అదనపు ఇఒ చిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి, సివిఎసీ మురళీకృష్ణ, సిపిఆర్ ఒ డాక్టర్ తలారి రవితో కలసి ఛైర్మన్ మీడియాతో మాట్లాడారు. శ్రీవారిసేవ ప్రారంభించి 25 సంవత్సరాలు కావస్తోందన్నారు.దాదాపు 17లక్షలమంది శ్రీవారి సేవకులు స్వచ్చందంగా శ్రీవారిసేవలో పాల్గొన్నారన్నారు. రోజుకు 3,500మంది వరకు సేవకులు సేవలందిస్తున్నారని తెలిపారు.

ప్రతిరోజూ శ్రీవారి దర్శనార్థం లక్షమంది వరకు భక్తులు వస్తున్నారని, వారికి అన్నిచోట్ల ఇతోధిక సేవలందించేందుకు శ్రీవారిసేవకులు సేవలందిస్తున్నారన్నారు. భక్తులకు మెరుగైన సేవలందించే దిశగా సేవలకు శిక్షణనివ్వాలని నిర్ణయించామన్నారు. తిరుమలలో భక్తులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించేందుకు క్యాంటీన్ల నిర్వహణ బ్రాండెడ్ హోటళ్లకు అప్పగించడం జరిగిందన్నారు.ఆదాయం ముఖ్యంకాదని, భక్తులకు సరసమైన ధరలకు ఆహారం అందించాలనే ధరల నియంత్రణ చేశామన్నారు. కొందరు పనిగట్టుకుని టెండర్లపై ఆరోపణలు చేస్తున్నారని, అలాంటివేమీ పట్టించుకోమన్నారు. కొన్ని నియమనిబంధనలు పెట్టామని, ప్రణాళికా బ

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com