భారతదేశంలో తొలి టెస్లా కారు డెలివరీ
- September 05, 2025
ముంబై: ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఎలక్ట్రిక్ వాహన తయారీ దిగ్గజం టెస్లా చివరకు భారత్ మార్కెట్లోకి అధికారికంగా ప్రవేశించింది.ముంబైలో తొలి షోరూమ్‌ను ప్రారంభించిన టెస్లా, దేశంలో మొట్టమొదటి కారును విక్రయించింది.
భారత్‌లో టెస్లా డెలివరీ చేసిన తొలి కారు గౌరవం మహారాష్ట్ర రవాణాశాఖ మంత్రి ప్రతాప్ సర్ నాయక్‌కు దక్కింది.ముంబైలోని ‘టెస్లా ఎక్స్‌పీరియెన్స్ సెంటర్’ వద్ద ఆయన తెలుపు రంగు ‘మోడల్ వై’ కారు తాళాలను స్వీకరించారు.
ఈ సందర్భంగా మంత్రి ప్రతాప్ సర్ నాయక్ మాట్లాడుతూ, “దేశంలో తొలి టెస్లా కారును అందుకోవడం గర్వకారణం. విద్యుత్ వాహనాల పై ప్రజల్లో అవగాహన పెంచే ఉద్దేశంతోనే ఈ కారు కొనుగోలు చేశాను” అని తెలిపారు. టెస్లా వాహనాల వినియోగం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కొంతవరకైనా మేలు జరుగుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం టెస్లా సంస్థ చైనాలోని షాంఘై ప్లాంట్‌లో తయారైన వాహనాలను భారత్‌కు దిగుమతి చేస్తోంది.ఇదే క్రమంలో, భారత మార్కెట్‌ను పరీక్షిస్తూ ప్రీమియం ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌ను టార్గెట్ చేస్తోంది.ఇప్పటికే టెస్లా కంపెనీ భారత్‌లో ప్లాంట్ స్థాపించే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది.స్థానిక తయారీ ప్రారంభమైతే, టెస్లా కార్ల ధరలు మరింత స్నేహపూర్వకంగా మారే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా వారధి ఇండియా ఫౌండేషన్ వార్షిక వేడుకలు
- ఆసియా క్రీడలకు గ్రాండ్ ఫినిష్.. 85 పతకాలతో భారత్
- దుబాయ్‌లో రెంట్ పెంచుతున్నారా? RERA ఇండెక్స్‌లో పెంపు లేదంటే టెనెంట్లు ఏం చేయాలి?
- ఒమన్‌లో దొంగతనం కేసు.. వ్యక్తి అరెస్ట్..!!
- కువైట్‌లో 263 భవనాల కూల్చివేతకు ఆదేశాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదల ముప్పు..!!
- బహ్రెయిన్‌లో కోస్ట్ గార్డ్ సంయుక్త తనిఖీలు..!!
- ఖతార్‌లో ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరణ..!!
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!







