యూఏఈలో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం..!!
- September 07, 2025
యూఏఈ: యూఏఈలో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. రెడ్ సీలో కేబుల్ కట్ కావడమే దీనికి కారణమని తెలుస్తోంది. వెబ్‌సైట్‌లు మరియు యాప్‌లు, టీవీ స్ట్రీమింగ్‌ను యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దుబాయ్, అబుదాబి, షార్జా, అల్ ఐన్, అజ్మాన్, రాస్ అల్ ఖైమా, ఫుజైరా, జెబెల్ అలీ మరియు ఉమ్ అల్ క్వైన్ లలో ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడినట్టు నిపుణులు తెలిపారు.
దుబాయ్ అంతటా ఈరోజు ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంది. చాలా మంది స్నేహితుల ఇళ్లలో ఈ సమస్య ఉందని UAE నివాసి ముహమ్మద్ యూసుఫ్ తెలిపారు. తాను స్వదేశంలో ఉన్న తన తల్లికి ఫోన్ చేయలేకపోయాను. రెడ్ సీ లో కేబుల్ కట్ అయిందని తనకు తరువాత తెలిసిందని షార్జా నివాసి వసీం అహ్మద్ అన్నారు. అనేక దేశాలను ప్రభావితం చేసిన ఈ సమస్యను పరిష్కరించడానికి ఇంజనీర్లు కృషి చేస్తున్నారని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో కొత్త 80 కి.మీ రోడ్డు కారిడార్.. ట్రాఫిక్ రద్దీకి చెక్
- ఖతార్‌లో చికెన్, కొన్ని కూరగాయలపై కస్టమ్స్ డ్యూటీ పెంపు..!!
- బహ్రెయిన్‌లో తెలియని వాట్సాప్ ఛారిటీకి డబ్బులు పంపొద్దు..!!
- కువైట్ హవల్లీలో భద్రతా తనిఖీలు..122 మంది అరెస్ట్..!!
- JEE మెయిన్ 2027 షెడ్యూల్ విడుదల
- ఒమన్–బోట్స్వానా మధ్య కీలక ఒప్పందాలు..!!
- సౌదీ పోర్టుల్లో భారీగా పెరిగిన కంటైనర్ రవాణా..!!
- 14% వృద్ధి నమోదు చేసిన యూఏఈ బీమా రంగం..!!
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?







