తెలంగాణ: రూ.50 లక్షలకు కేజీ డ్రగ్స్..
- September 07, 2025
హైదరాబాద్: తెలంగాణలో ఇటీవల వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ తయారీ యూనిట్ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ డ్రగ్స్ దందా వెనుక విజయ్ ఓలేటి అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని అధికారులు గుర్తించారు. అతను కిలో రూ.50 లక్షల చొప్పున డ్రగ్స్ ను హైదరాబాద్లో విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ అక్రమ వ్యాపారం కోసం అతను ఒక ప్రత్యేక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుని వందల కోట్ల రూపాయలు సంపాదించారని అధికారులు తెలిపారు.
ఈ డ్రగ్స్ యూనిట్ ను పట్టుకోవడంలో పోలీసుల వ్యూహాత్మక దర్యాప్తు కీలక పాత్ర పోషించింది. ముంబై నార్కోటిక్ పోలీసులలో ఒకరు సాధారణ కార్మికుడిలా ఆ డ్రగ్స్ యూనిట్లో చేరారు. అలా చేరిన అధికారి పక్కాగా వివరాలు సేకరించి, ఆ యూనిట్ గుట్టును రట్టు చేయడంలో సాయపడ్డారు. ఈ సమాచారం ఆధారంగానే పోలీసులు దాడులు నిర్వహించి డ్రగ్స్ తయారీ యూనిట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ యూనిట్ బయటపడటంతో రాష్ట్రంలో డ్రగ్స్ దందాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు, అధికారులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న ఈ మాదక ద్రవ్యాల వ్యాపారంపై నిఘా పెంచి, పూర్తి స్థాయిలో నియంత్రించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్‌లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్‌లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







