నేపాల్‌లో రెచ్చిపోయిన ఆందోళనకారులు..

- September 09, 2025 , by Maagulf
నేపాల్‌లో రెచ్చిపోయిన ఆందోళనకారులు..

నేపాల్ లో హింస రాజ్యమేలుతోంది. ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. వారి ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఆందోళనలు తీవ్రరూపం దాల్చాయి. నిరసనకారులు మంత్రులను టార్గెట్ చేశారు. వీధుల్లో ఉరికించి ఉరికించి మరీ కొడుతున్నారు. మంత్రులపై దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆర్థిక మంత్రి బిష్ణు ప్రసాద్‌ పౌడేల్‌ (65) ని నిరసనకారులు టార్గెట్ చేశారు. ఆయనపై దాడి జరిగినట్లు తెలుస్తోంది.నిరసనకారులు మంత్రిని వీధుల్లో పరిగెత్తించారు. ఆయనపై దాడి చేశారు. ఓ వ్యక్తి కాలితో ఎగిరితన్నాడు. నిరసనకారుల నుంచి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు మంత్రి ప్రసాద్ పరుగులు పెట్టారు. ఈ ఆందోళనకర దృశ్యాలు కలవరపెడుతున్నాయి. మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవుబాను ఆందోళనకారులు వదల్లేదు. వారిపైనా దాడి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com