మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- September 13, 2025
మహిళల హకీ ఆసియా కప్‌లో భారత జట్టు మరోసారి తన శక్తిని చాటుకుంది. సూరజ్ లతా దేవీ నేతృత్వంలోని టీమిండియా శుక్రవారం జరిగిన కీలక సూపర్ 4 మ్యాచ్‌లో జపాన్‌తో 1-1తో డ్రా చేసి ఫైనల్ బెర్తు దక్కించుకుంది.ఇక మరో మ్యాచ్‌లో చైనా కొరియా పై 1-0 తేడాతో విజయం సాధించింది. దీంతో ఫైనల్లో భారత్‌కి ఎదురుగా నిలవనుంది. చైనా ఈ విజయంతో పట్టికలో టాప్‌లో నిలిచింది. భారత్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ముగించింది. దీంతో ఇరుజట్లు ఆదివారం ట్రోఫీ కోసం తలపడనున్నాయి.ఫైనల్లో గెలుపొందిన జట్టు వచ్చే ఏడాది జరగబోయే ఎఫ్ఐహెచ్ మహిళల వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీ బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనుంది. అందుకే భారత్-చైనా పోరు ఆసక్తిని రేపుతోంది.
భారత్ ఆరంభం నుంచే దూకుడు చూపించింది. ఆట మొదలైన 7వ నిమిషంలోనే నేహా గోయల్ గోల్ ప్రయత్నం చేసింది. ప్రత్యర్థి ప్లేయర్ డుంగ్ డుంగ్ బంతిని ఆపినా, అది గోల్‌లైన్ దాటి లోపలికి వెళ్లడంతో రిఫరీ భారత్‌కు గోల్ ప్రకటించాడు. ఈ గోల్‌తో భారత్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.రెండో అర్ధభాగంలో జపాన్ దాడులను పెంచింది.పెనాల్టీ కార్నర్ ద్వారా గోల్ సాధించాలని ప్రయత్నించింది. కానీ భారత గోల్‌కీపర్ అద్భుత రక్షణతో వాటిని అడ్డుకున్నాడు. దీంతో భారత్ ఆధిక్యం కొనసాగింది.మూడో అర్ధ భాగంలో జపాన్ మరింత ఒత్తిడి తెచ్చింది. 58వ నిమిషంలో షిమో కొబయకవడా బంతిని నెట్లోకి పంపింది. దీంతో మ్యాచ్ 1-1తో సమమైంది. ఇరుజట్లూ ఆఖరి వరకూ పోరాడినా స్కోర్లు మారలేదు.
తాజా వార్తలు
- ఖతార్ లో కస్టమర్ సర్వీస్ వీక్ 2026ను నిర్వహిస్తున్న PHCC..!!
- సౌదీ అరేబియాలో పండ్లు, కూరగాయల దిగుమతికి కొత్త నిబంధనలు..!!
- ఒమన్‌లో పర్యాటక కార్యకలాపాల లైసెన్సింగ్‌కు కీలక నిబంధనలు..!!
- యూఏఈ లాటరీ.. ఓ విజేతకు Dh5 మిలియన్ భారీ బహుమతి..!!
- హవల్లీ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం..!!
- బిగ్ టికెట్ అబుదాబి.. అజ్మాన్ ఫిలిప్పీన్స్ ప్రవాసికి Dh20 మిలియన్ జాక్‌పాట్..!!
- బహ్రెయిన్ విమానాశ్రయం వెనుక మాంగ్రూవ్ బెల్ట్..!!
- కువైట్ విమానాశ్రయంలో ట్రాన్సిట్ కార్యకలాపాలు నిలిపివేత యధాతథం..!!
- సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కేరళ నర్సులు సహా ఐదుగురు మృతి
- కాక్‌పిట్ పై దాడి.. ‘చివరి పోరాటం’తో వందల ప్రాణాలు కాపాడిన ఫ్లై దుబాయ్ పైలట్







