కొత్తగా 3 ఎయిర్‌పోర్టులు.. నివేదికలు సిద్ధం చేసిన ప్రభుత్వం!
- August 16, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో భాగంగా విమానయాన రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ప్రయాణ సమయాన్ని తగ్గించి, అనుసంధానతను (Connectivity) మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అమరావతి, శ్రీకాకుళం, మరియు కుప్పం ప్రాంతాల్లో నూతన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి సాంకేతిక, ఆర్థిక నివేదికలను (TEFR) సిద్ధం చేసింది.
తొలి దశకు ₹5,545 కోట్లు కేటాయింపు!
తొలి దశలో ఈ మూడు ఎయిర్‌పోర్టుల అభివృద్ధికై మొత్తం ₹5,545 కోట్ల వ్యయం కాగలదని అంచనా వేసింది. దీనికోసం హడ్కో (HUDCO) నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. రాజధాని అమరావతిలో 4,618 ఎకరాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ₹4,419 కోట్లతో పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ (PPP) నమూనాలో ఎయిర్‌పోర్ట్ నిర్మించనున్నారు. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) భాగస్వామ్యంతో ఎయిర్‌పోర్ట్ నిర్మాణం జరగనుండగా, కుప్పంలో రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రీజినల్ ఎయిర్‌పోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నారు.
సైట్ క్లియరెన్స్ మరియు ఇతర కేంద్ర అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలను సమర్పించింది. భూసేకరణతో పాటు రోడ్లు, డ్రైనేజీ వంటి ట్రంక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులను వేగవంతం చేస్తూ రాష్ట్రంలో ప్రతీ ప్రాంతం నుంచి గంట వ్యవధిలోనే సమీప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునేలా ఈ ప్రణాళికను రూపొందించారు.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







