తొలిచిత్రం విడుదలకు ముందే నాలుగు అవకాశాలు ..
- July 19, 2016
లి ప్రయత్నంలోనే సినీహీరో అవకాశం దక్కించుకొన్న యువకుడు నాచారం కుర్రాడు.. అదరగొడుతున్నాడు కలలు కనండి.. వాటిని సాకారం చేసుకోండి అన్నది పెద్దల నానుడి. కచ్చితంగా ఆ సూత్రంతోనే తొలి ప్రయత్నంలోనే సినీహీరోగా తెరగేట్రం చేస్తున్నాడో కుర్రాడు. తొలిసినిమా విడుదలకు ముందే మరో చిత్రం అవకాశం దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అతడే మండలంలోని నాచారానికి చెందిన తరుణ్‌తేజ్. ఈ యువకుడి సరదాగా తీసిన షార్ట్‌ఫిలిం నాచారానికి చెందిన ప్రభుత్వ ప్రధానోపాధ్యాయుడు జగపతిరావు కుమారుడు తరుణ్‌తేజ్. ప్రాథమిక విద్యాభ్యాసం మొత్తం అశ్వారావుపేట మండలంలో కొనసాగింది. బీటెక్ సత్తుపల్లిలో మదర్ థెరీసా కాలేజ్‌లో చదువుకొన్నాడు. అనంతరం ఎంటెక్ కోసం మూడేళ్ల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. ఇక్కడ చదుకొనే రోజుల్లో నటనపై ఉన్న ఆసక్తితో చిన్నచిన్న షార్ట్ ఫిల్మ్‌ల్లో మిత్రులతో కలసి నటించాడు. వీటిని చిత్ర రంగంతో సంబంధం ఉన్న సామర్లకోటకు చెందిన చిన్నయ్య దొరకు చూపించారు.
కుటుంబ సభ్యుల సహకారంతో షాట్ఫిల్మ్లో తరుణ్‌తేజ్ నటనకు చూసిన చిన్నయ్యదొర హీరో అయితే మంచి భవిష్యత్ ఉంటుందని ప్రోత్సహించాడు. ఆయన ప్రోత్సాహంతోనే దమ్మపేటకు చెందిన కొంతమంది మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారంతో తేజ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై రవి కుమార్ పి.దర్శకత్వంలో 'ఎలాగైనా సినిమా తీయాలి' అనే చిత్నాన్ని ప్రారంభించారు. ఈ సినిమాలో సాంకేతిక బృందంతో పాటుగా, ఇతర నటీనటుల్లో ఎక్కువగా ఈ ప్రాంతం వాళ్లకే అవకాశాలు కల్పించారు.
విడుదలకు ముందే నాలుగు అవకాశాలు తొలిచిత్రం విడుదలకు ముందే తరుణ్తేజ్కు మరో నాలుగు చిత్రాల్లో హీరోగా అవకాశం దక్కింది. ఒకే ఒక ఆశ, గండికోట రహస్యం, ఆచార్య దేవోభవ, నీ చిరునామా నా హృదయాన చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో గండికోట రహస్యం ఇటీవల ప్రారంభమైంది. ఇలా వరుస చిత్రాలతో సినీ రంగంలో తనకంటూ ఓ స్థానం కోసం తరుణ్‌తేజ్ శ్రమిస్తున్నాడు. ప్రస్తుతం ఎలాగైనా సినిమా తీయాలి. పాటల విడుదల ఇటీవల ఈత్రీ మ్యూజిక్ ద్వారా హైదారాబాద్‌లోని మా ఛాంబర్లో ప్రముఖ నిర్మాత ప్రతాని రామకృష్ణగౌడ్ చేతుల మీదుగా, సినీ ప్రముఖుల సమక్షంలో ఆవిష్కరణ జరిగింది. మరో సినిమా ఒకే ఒక ఆశ సినిమా పాటల వేడుక ప్రముఖ సిని నటి కవిత, సీనియర్ దర్శకులు సాగర్ చేతుల మీదుగా వైభవంగా జరిగింది. ఈ రెండు వచ్చే ఆగస్టులో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే, తన చదువును పూర్తి చేశాడు.
మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలి తరుణ్‌తేజ్, వర్ధమాన కథానాయకుడు చిత్ర పరిశ్రమలో మంచి నటుడిగా పేరు తెచ్చుకోవాలన్నది నా ఆశ. దీని కోసం నటించే చిత్రాల్లో కథ¿, కథనంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాను. నేను హీరో కావడానికి సహకరించిన పెద్దలు, ప్రోత్సహించిన కుటుంబ సభ్యులకు ఎప్పటికి రుణపడి ఉంటాను.
తాజా వార్తలు
- ఆస్ట్రేలియా క్రికెటర్ కు 9 నెలలు జైలు శిక్ష
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!







