మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- September 16, 2025
మస్కట్: మస్కట్ మునిసిపాలిటీ కీలక ప్రదేశాలలో ఫీల్డ్ పార్కింగ్ సర్వేలను ప్రారంభించింది. ఈ మేరకు మునిసిపాలిటీ తన అధికారిక X (గతంలో ట్విట్టర్) ఖాతాలో వెల్లడించింది. ఈ సర్వే మూడు వారాల పాటు కొనసాగుతుందని తెలిపింది.
మస్కట్లో మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ పరిష్కారాల అభివృద్ధికి మద్దతుగా పార్కింగ్ వినియోగంపై ఖచ్చితమైన డేటాను సేకరించడం ఈ అధ్యయనం లక్ష్యమని పేర్కొంది. సర్వేలో భాగంగా అల్ సీబ్ సౌక్, అల్ బరాకత్ స్ట్రీట్, అల్ ఖౌద్ సౌక్, ఖురుమ్ బీచ్, ఖువైర్ కమర్షియల్ ఏరియా, ఖురుమ్ కమర్షియల్ ఏరియా మరియు అల్ మహా స్ట్రీట్ లలో వాహనాలపై డేటాను సేకరిస్తారు. వాహనదారులు సర్వే బృందాలకు సహకరించాలని అథారిటీ కోరింది.
తాజా వార్తలు
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్
- పొంగల్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోదీ
- ఐఐటీ హైదరాబాద్లో ఫైర్సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు
- ఖతార్ విజిటర్లలో 35% మంది గల్ఫ్ దేశాల వారే..!!
- సౌదీలో 89 నాన్ ప్రాఫిట్ సంస్థలపై విచారణ..!!
- దుబాయ్లో రియల్ మార్కెట్ మందగమనంలో ఉందా? నిజమెంత?
- నివాస ప్రాంతాలలో కొత్త ప్రైవేట్ స్కూళ్లకు అనుమతి లేదు..!!
- ఒమన్ లో మినిస్టర్స్, అఫిషియల్స్ ప్రమాణ స్వీకారం..!!
- ఆరు నెలల్లో 1,109 మందిపై బహిష్కరణ వేటు: బహ్రెయిన్
- హమద్ పోర్టులో ఆడియో స్పీకర్లలో షాబు..!!







