'జటాధర' నవంబర్ 7న థియేటర్స్‌లో గ్రాండ్ గా రిలీజ్
- September 16, 2025
నవ దళపతి సుధీర్ బాబు, బాలీవుడ్ పవర్‌హౌస్ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సూపర్ నేచురల్ మైథలాజికల్ థ్రిల్లర్ జటాధర. అద్భుతమైన సినిమాటిక్ అందించే ఈ పాన్-ఇండియా ద్విభాషా చిత్రానికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. హై-ఆక్టేన్ విజువల్స్, పౌరాణిక ఇతివృత్తాలతో ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది. ఇటివల రిలీజ్ అయిన టీజర్ నేషనల్ వైడ్ గా వైరల్ అయ్యింది.
మూవీ మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. విజువల్ స్పెక్టకిల్ జటాధర నవంబర్ 7, 2025న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది.
రిలీజ్ డేట్ పోస్టర్ డివైన్ ఎనర్జీతో అదిరిపోయింది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా తో పాటు దివ్యా ఖోస్లా, శిల్పా శిరోధ్కర్, ఇంద్రకృష్ణ, రవి ప్రకాష్, నవీన్ నేని, రోహిత్ పాఠక్, ఝాన్సీ, రాజీవ్ కనకాల, సుభలేఖ సుధాకర్ లాంటి అద్భుత తారాగణం స్క్రీన్‌పై కనువిందు చేయనున్నారు.
జీ స్టూడియోస్ సీబీఓ ఉమేష్ కుమార్ బన్సాల్ మాట్లాడుతూ.. “జటాధర సాధారణ సినిమా కాదు, ఇది ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. స్కేల్, స్టోరీటెల్లింగ్, విజన్ పరంగా ఆడియన్స్‌ను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాం.
ప్రేరణ అరోరా మాట్లడుతూ “రుస్తమ్ తర్వాత జీ స్టూడియోస్‌తో మరోసారి కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా గ్లోబల్ లెవెల్‌లో ప్రజెంట్ చేస్తున్నాం. ఇది ఎమోషనల్‌గా , విజువల్‌గా రేర్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది.
డైరెక్టర్స్ అభిషేక్ జైస్వాల్, వెంకట్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “జటాధర ఒక ఫోక్ టేల్ నుంచి పుట్టిన అద్భుతమైన కథ. డివైన్ పవర్, కాస్మిక్ డెస్టినీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించబోతోంది.
జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా ప్రెజెంట్ చేస్తున్న జటాధరను ఉమేష్ కుమార్ బన్సాల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింఘాల్, నిఖిల్ నందా ప్రొడ్యూస్ చేస్తున్నారు. అకాష్ కేజ్రీవాల్, కుస్సుం అరోరా కో-ప్రొడ్యూసర్స్. దివ్యా విజయ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్, భావిని గోస్వామి సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు. మ్యూజిక్‌ని జీ మ్యూజిక్ కో అందిస్తోంది.
విజనరీ టీమ్, గ్రౌండ్ బ్రేకింగ్ కాన్సెప్ట్‌తో ‘జటాధర’ నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల
- డ్రగ్స్ కేసుల్లో చిక్కుకున్న విదేశీయులను వెనక్కి పంపనున్న కేంద్రం
- టీటీడీ ఈవోకు శుభాకాంక్షలు తెలిపిన టిటిడి పాలక మండలి