ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్‌ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు

- September 17, 2025 , by Maagulf
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్‌ ప్రెసిడెంట్‌గా బండారు నరసింహరావు

హైదరాబాద్: గుంటూరు న్యూ క్రికెట్ క్లబ్‌కు చెందిన బండారు నరసింహరావు, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) వైస్‌ ప్రెసిడెంట్‌గా మంగళవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ACA అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్నీ) ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరిగింది.రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ నరసింహరావు ఎన్నికను అధికారికంగా ధృవీకరించారు.

ఈ సందర్భంగా నరసింహరావు మాట్లాడుతూ – “ACA అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్, కార్యదర్శి మరియు రాజ్యసభ సభ్యుడు సనా సతీష్ బాబు, ACA కమిటీ సభ్యులు, అపెక్స్ సభ్యులు నన్ను ఏకగ్రీవంగా వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను,” అని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com