కిష్కింధపురి సక్సెస్ మీట్ లో మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్
- September 18, 2025
ష్కింధపురికి ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.ఇది ఖచ్చితంగా అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ థ్రిల్లింగ్ బ్లాక్ బస్టర్ 'కిష్కింధపురి'. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. అద్భుతమైన ప్రిమియర్స్ తో మొదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని హౌస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. హీరో సాయి దుర్గతేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి, బాబీ, వశిష్ట, అనుదీప్ అతిధులు గా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
సక్సెస్ మీట్ లో హీరో సాయి దుర్గతేజ్ మాట్లాడుతూ..అందరికీ నమస్కారం. మంచి సినిమాని ముందుకు తీసుకెళుతున్న మీడియా వారికి థంక్ యు.సాహుతో నాకు మంచి ఒక అనుబంధం ఉంది.సాహు తమ్ముడు డిగ్రీలో నా క్లాస్ మేట్. ఆ బాండ్ అప్పటినుంచి ఉంది. సాయి తో నాకు ముంబైలో యాక్టింగ్ క్లాస్ నుంచి పరిచయం ఉంది.15 ఏళ్లుగా మా జర్నీ కొనసాగుతోంది. ఫిలింనగర్ అంతా రచ్చ లేపేసేవాళ్ళం.ఈ స్టేజ్ నాకు ఒక రియూనియన్ లాగా ఉంది. నా టెన్త్ క్లాసు మేట్ వశిష్ట, కనిష్క కూడా నా క్లాస్ మేట్. అందర్నీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. చేతన్ భరద్వాజ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. అనిల్ గారు నాకు ఎంతో సన్నిహితులు. మా మావయ్య తో చేస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సక్సెస్ మీట్ లో అందరూ నవ్వుకోవడం కూడా ఒక పెద్ద సక్సెస్. ఈ మూమెంట్ ని ఎంతో ఎంజాయ్ చేస్తున్నాం.ఇది మొత్తం ఇండస్ట్రీ సక్సెస్ లాగా భావిస్తున్నాను. ఇండస్ట్రీ ఒక ఎవల్యూషన్ దశలో ఉంది. మంచి కథలు రావాలి.ఆడియన్స్ ని ఎక్సయిట్ చేసే కథలు రావాలి. అలా వస్తేనే ఆడియన్స్ కి వస్తారు. అలాంటి సినిమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిస్కింధపురి..ఇలా అన్ని సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి.మంచి కంటెంట్ ని ఆడియన్స్ సపోర్ట్ చేస్తున్నారు.ఇంత మంచి హిట్ అందుకున్న కిస్కింధపురి టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.
హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ ఈవెంట్ కి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు.ప్రేక్షకులు ఈ సినిమాని గొప్పగా ఆదరించి ఇంత పెద్ద హిట్ చేసినందుకు కృతజ్ఞతలు.సాయి నేను మంచి ఫ్రెండ్స్. బాబి,అనిల్ రావిపూడి,వశిష్ట,అనుదీప్ కి థాంక్యూ సో మచ్. ఇక్కడికి గెస్ట్ లుగా రాలేదు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా వచ్చారు.ఈ సెప్టెంబర్ మంత్ థియేటర్స్ కి చాలా బావుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి సెలబ్రేట్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. బాబీ అన్న అల్లుడు శీను సినిమాకి చాలా మంచి కథ ఇచ్చారు. అప్పుడు నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది.ఆయన మాకు బెస్ట్ విషెస్ అందించడానికి అందించినందుకు చాలా థాంక్స్.అందరితో నాకు ఒక పర్సనల్ అనుబంధం ఉంది. వారందరూ వచ్చి మమ్మల్ని బ్లెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. కిస్కింధపురి థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. అందరూ థియేటర్స్ కి వచ్చి సినిమాను చూసి సపోర్ట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే ఇంకో పది మందికి చెప్పండి. ఇది మీ అందరిని అలరించే సినిమా.తేజ్ తో నాది వెరీ లాంగ్ జర్నీ. ఆయన భైరవం సినిమా కూడా సపోర్ట్ చేశారు.ఇప్పుడు ఈ వేడుకకు రావడం చాలా ఆనందంగా ఉంది. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా మిత్రులు అందరికీ థాంక్యూ. మరింత సపోర్ట్ చేసే సినిమాని గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ..అందరికి నమస్కారం. టీమ్ అందరికి కంగ్రాజులేషన్స్. ప్రీ రిలీజ్ ఈవెంట్ పిలిచినప్పుడు హారర్ సినిమా అంటే నాకు భయం. చూడలేను అని చెప్పాను. నిజంగా నాకు భయం.సాహు కి మాట ఇచ్చినట్టు ఈ సినిమా చూశాను.చాలా చోట్ల భయపడ్డాను. కొన్ని సీక్వెన్స్ లో థియేటర్స్ మొత్తం షేక్ అయింది.అందరూ భయపడ్డారు.ఈ సెప్టెంబర్ ఒక సక్సెస్ఫుల్ సెప్టెంబర్ అయింది. కొత్తలోక, మిరాయి కిష్కిందపురి లిటిల్ హార్ట్స్ సినిమాలతో థియేటర్స్ కళకళలాడుతున్నాయి.థియేటర్స్ లో ఒక చిన్న ఫెస్టివల్ లా ఉంది. ఈ మూమెంట్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి. కౌశిక్ అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఇక్కడ నుంచి తను సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడని కోరుకుంటున్నాను. తన నమ్మి అవకాశం ఇచ్చిన నిర్మాత సాహు,సాయికి కంగ్రాజులేషన్స్.ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ జర్నీ స్టార్ట్ చేసిన హీరో శ్రీనివాస్ ఇదే కంటిన్యూ చేస్తూబ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని కోరుకుంటున్నాను.టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ..అందరికి నమస్కారం. టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. కౌశిక్ నాకు ఫస్ట్ సినిమా నుంచి తెలుసు.తన సినిమా బ్లాక్ బస్టర్ అవడం చాలా ఆనందంగా ఉంది.హీరో నిర్మాతల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు .హారర్ ఫిలిమ్స్ చాలా జాగ్రత్తగా తీయాలి. చాలా చాలా స్ట్రాంగ్ కంటెంట్ ఉంటేనే జనం థియేటర్స్ కి వస్తారు. హారర్ తో పాటు మంచి మెసేజ్ని పెట్టడం చాలా బాగా అనిపించింది. సాయి ఏ బ్యాగ్రౌండ్ లేనట్టుగానే చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. తన ఈ సినిమాతో విజయాన్ని అందుకోవడం చాలా ఆనందాన్ని ఇచ్చింది.సాహు ఈ సినిమాతో ఒక బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నారు. సంక్రాంతికి రాబోతున్న చిరంజీవి,అనిల్ సినిమాలో కొన్ని పార్ట్స్ చూశాను. సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ కాబోతోంది. సాహూకి కంగ్రాట్యులేషన్స్. టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్.
డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్. బెల్లంకొండ సాయి కొత్త జొనర్ లో బ్లాక్ బస్టర్ కొట్టారు. సాహుకి, టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్.
డైరెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ...అందరికి నమస్కారం.నిన్ననే సినిమా చూశాను. ఇది అందరూ థియేటర్స్ లో చూడాల్సిన సినిమా. అందరూ మిస్ కాకుండా చూడండి. సాయికి కంగ్రాజులేషన్స్.సాహు ఇలాంటి సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను. కౌశిక్ నుంచి ఇలాంటి మరిన్ని సినిమాలు రావాలని కోరుకుంటున్నాను.
నిర్మాత సాహూ గారపాటి మాట్లాడుతూ...అందరికి నమస్కారం.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన సాయి దుర్గతేజ్,బాబి,అనిల్ రావిపూడి,వశిష్ట,అనుదీప్ కి థాంక్యూ సో మచ్. అక్కడికి వచ్చిన గెస్ట్ లందరూ కూడా సినిమా చూసి మాకు ఫోన్ చేసి వాళ్ళ ఆనందాన్ని మాతో పంచుకున్నారు. వాళ్ళందరిని పిలిస్తే ఒక స్పెషల్ గా ఉంటుందని ఈ వేడుక నిర్వహించాము. కౌశిక్ అనుకున్న కథ స్క్రీన్ మీదకి ఒక హాలీవుడ్ సినిమా స్థాయిలో వచ్చింది. ఆడియన్స్ కూడా అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు.సాయి శ్రీనివాస్ తన చేస్తున్న సినిమాలకి ఒక డిఫరెంట్ జానర్ చేయాలని ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. అనుపమ గారు అద్భుతంగా పెర్ఫాం చేశారు. అందరూ కూడా తమ పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. అందుకే ఆడియన్స్ నుంచి అంత మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆడియన్స్ సూపర్ హిట్ చేశారు. అందరికీ నచ్చింది కాబట్టి సినిమా అద్భుతంగా ఆడుతోంది. ఇది ఒక నిర్మాతగా చాలా ఆనందాన్నిస్తోంది. ఈ హిట్ మరింత ఉత్సాహంగా పనిచేయడానికి ఎనర్జీ ఇచ్చింది.
డైరెక్టర్ కౌశిక్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం.ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా వచ్చిన సాయి ధరంతేజ్,బాబి,అనిల్ రావిపూడి,వశిష్ట,అనుదీప్ కి థాంక్యూ సో మచ్.డిస్ట్రిబ్యూటర్స్ నిర్మాతలు హ్యాపీగా ఉండటమే రియల్ సక్సెస్.ఈ సినిమా అలాంటి ఆనందాన్ని ఇచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత సాహూ గారికి థాంక్యూ.అడియన్స్ థియేటర్స్ కి రావడం తగ్గిపోయిన రోజుల్లో ఈ సినిమాకి హౌస్ ఫుల్ బోర్డ్స్ చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. నాకు సపోర్ట్ చేసిన టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సక్సెస్ మా టీమ్ అందరికి డెడికేట్ చేస్తున్నాను. మీరందరూ కానీ నాకు ఈ సక్సెస్ డెడికేట్ చేశారు. కిస్కింధపురి పార్ట్ 2 ఎప్పుడు అని అడుగుతున్నారు. ఐడియా వుంది డెఫినెట్ గా వస్తుంది.
మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మాట్లాడుతూ..అందరికి నమస్కారం. సినిమా సక్సెస్ చాలా ఆనందాన్నిచ్చింది. సినిమా ఆర్గానిక్ గా ఆడియన్స్ కి కనెక్ట్ అయింది.మా మ్యూజిక్ టీమ్ అందరికీ థాంక్యు. అవకాశం నాకు ఇచ్చిన నిర్మాత సాహూ కి థాంక్యూ. నన్ను బిలీవ్ చేసిన డైరెక్టర్ కౌశిక్ కి థాంక్యూ. సినిమాకి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. మూవీ టీం అంతా ఈ వేడుకలో పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..