‘కాంతార: చాప్టర్ 1’ ట్రైలర్ సెప్టెంబర్ 22న రిలీజ్
- September 19, 2025
2022లో విడుదలైన "కాంతార" బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. హోంబలే ఫిలింస్‌కి గ్రేట్ మైల్ స్టోన్ గా నిలిచింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కాంతారా: చాప్టర్ 1 కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ మూవీగా ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రానుంది. కాంతారా: చాప్టర్ 1 ట్రైలర్ 22 సెప్టెంబర్ 2025న మధ్యాహ్నం 12:45 గంటలకు విడుదల అవుతుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ మేరకు మేకర్స్ సోషల్ మీడియాలో అద్భుతమైన పోస్టర్ షేర్ చేశారు.
హోంబలే ఫిలింస్‌లో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లలో కాంతార: చాప్టర్ 1 ఒకటి. ఈ చిత్రానికి బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, అర్వింద్ కాశ్యప్ సినిమాటోగ్రఫీ, వినేశ్ బాంగ్లాన్ ప్రొడక్షన్ డిజైనర్.
2022లో వచ్చిన మాస్టర్‌పీస్ కాంతార విజయన్ని కొనసాగించడంలో హోంబలే ఫిలింస్ ఎలాంటి రాజీ పడలేదు. ఈ చిత్రంలో 500 మంది యోధులు, సుమారు 3,000 మంది ప్రజలు పాల్గొనే ఒక భారీ యుద్ధ సన్నివేశాన్ని రూపొందించారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణుల పర్యవేక్షణలో, 25 ఎకరాల పట్టణం నిర్మించి, దాదాపు 45–50 రోజులపాటు ఈ షూటింగ్ జరిగింది. ఇది భారతీయ సినిమా చరిత్రలోనే అతి పెద్ద సన్నివేశాల్లో ఒకటిగా నిలిచింది.
ఈ చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. కన్నడతో పాటు హిందీ, తెలుగు, మలయాళం, తమిళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం చేరువ కానుంది.
కాంతార: చాప్టర్ 1 ద్వారా హోంబలే ఫిలింస్ గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాకు యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా ఆమోదం
- దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడులు
- అక్టోబర్ 7న తిరిగి తెరుచుకోనున్న దుబాయ్ పార్క్స్ అండ్ రిసార్ట్స్
- కువైట్‌లో 172 బాటిళ్ల లిక్కర్ సీజ్.. ప్రవాసుడు అరెస్ట్..!!
- అంగోలాకు చేరుకున్న ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్..!!
- సౌదీలో ఎక్స్‌పాట్ డాక్టర్‌పై విచారణ..!!
- యూఎన్ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- ఖతార్‌లో మళ్లీ UFC ఫైట్ నైట్..!!
- ఒమన్‌లో వాహనదారులకు అలర్ట్.. నవంబర్ 18 స్ట్రీట్‌లో ట్రాఫిక్ మళ్లింపు..!!
- అబుదాబిలో హాలిడే హోమ్ నిబంధనలు మార్పు..!!







