డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- July 18, 2026
దుబాయ్: డబ్బులు తీసుకుని ఉద్యోగ, రెసిడెన్సీ లేదా విజిట్ వీసాలు ఇప్పిస్తామని సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌ల ద్వారా ప్రచారం చేస్తున్న మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన యాంటీ-ఫ్రాడ్ సెంటర్ హెచ్చరించింది.
‘బి అవేర్ ఆఫ్ ఫ్రాడ్’ (Be Aware of Fraud) అవగాహన కార్యక్రమంలో భాగంగా విడుదల చేసిన ప్రకటనలో, లైసెన్స్ లేని కంపెనీలు, కార్యాలయాల పేర్లతో లేదా ప్రభుత్వ సంస్థల పేర్లను దుర్వినియోగం చేస్తూ కొందరు నకిలీ ప్రకటనలు విడుదల చేస్తున్నారని తెలిపింది. ఉద్యోగాలు, రెసిడెన్సీ లేదా విజిట్ వీసాలు ఇప్పిస్తామని నమ్మించి బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొంది.
వీసాలకు సంబంధించిన అన్ని ప్రక్రియలను సంబంధిత ప్రభుత్వ శాఖలు లేదా అధికారికంగా గుర్తింపు పొందిన కార్యాలయాల ద్వారానే పూర్తి చేయాలని యాంటీ-ఫ్రాడ్ సెంటర్ సూచించింది. మధ్యవర్తులు లేదా నమ్మకంలేని వ్యక్తులను ఆశ్రయించవద్దని, వీసా ఆఫర్లు లేదా దరఖాస్తు ప్రక్రియల నిజానిజాలను అధికారిక మార్గాల ద్వారానే ధృవీకరించుకోవాలని స్పష్టం చేసింది.
మోసాలను అరికట్టడంలో ప్రజల్లో అవగాహన, సేవలు అందిస్తున్న సంస్థల విశ్వసనీయతను ముందుగానే నిర్ధారించుకోవడం అత్యంత కీలకమని అధికారులు తెలిపారు. అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు లేదా వీసాలు ఇప్పిస్తామని చేసే తప్పుడు హామీలను నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఎవరైనా మోసానికి గురైనా లేదా మోసం చేసే ప్రయత్నాలను గుర్తించినా వెంటనే
దుబాయ్ పోలీస్ స్మార్ట్ యాప్, సైబర్ నేరాల ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన eCrime ప్లాట్‌ఫామ్ లేదా 901 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని యాంటీ-ఫ్రాడ్ సెంటర్ ప్రజలను కోరింది.
తాజా వార్తలు
- యూఏఈలో డ్రైవర్‌లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్‌లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్‌లో ఆరో రింగ్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- బహ్రెయిన్ ఓపెన్ ప్రిజన్స్ కాంప్లెక్స్‌ను సందర్శించిన అమెరికా రాయబారి..!!
- ఖతార్‌లో హోటల్ రెస్టారెంట్ మూసివేత..!!
- ఖతార్ మాల్స్ లో కొనసాగుతున్న బ్యాక్-టు-స్కూల్ షాపింగ్..!!
- డిసెంబర్లో వరంగల్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన: కేంద్ర మంత్రి రామ్మోహన్
- కువైట్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడులు.. అడ్డుకున్న వాయు రక్షణ వ్యవస్థలు
- వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: సీఎం రేవంత్ రెడ్డి







