డైరెక్టర్ మారుతి కథ.. సాయి దుర్గ తేజ హీరో..
- September 21, 2025
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ప్రాజెక్టు లాక్ అయ్యింది. మెగా సుప్రీం సాయి దుర్గ తేజ మరో భారీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్నారు. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటిగ్ దశలో ఉంది. హనుమాన్ సినిమాను తెరకెక్కించిన ప్రైమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
అయితే, ఈ సినిమాకు వీడియోకి ముందే మరో భారీ సినిమాను మొదలుపెట్తాస్తున్నాడు. మిరాయ్ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుకి రాజా సాబ్ సినిమాను తెరకెక్కిస్తున్న మారుతి కథను అందించనున్నారు. రాజా సాబ్ లానే ఈ కథ కూడా నెక్స్ట్ లెవల్లో ఉండబోతుందని టాక్. డార్లింగ్ స్వామీ మాటలు అందించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అధికారిక ప్రకటన రానుంది.
ఇక సాయి దుర్గ తేజ-మారుతి కాంబోలో ఇప్పటికే ప్రతీరోజు పండగే సినిమా చేశారు. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో సాదించింది ఈ సినిమా.దాంతో, మారుతీ-సాయి దుర్గ తేజ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ ఉండనున్నాయి. మరి ఈ సినిమా ఆ మ్యాజిక్ ను క్రియేట్ అవుతుందా చూడాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?