న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!

- September 22, 2025 , by Maagulf
న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!

దోహా: న్యూఢిల్లీలో జరుగుతున్న IEC వార్షిక సమావేశంలో పలు దేశాలకు ప్రతినిధులు పాల్గొన్నారు. ఖతార్ ప్రతినిధి బృందానికి ఖతార్ జనరల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డ్స్ అండ్ మెట్రాలజీ (QGOSM) చైర్‌పర్సన్ ఇంజనీర్ మొహమ్మద్ బిన్ సౌద్ అల్ ముసల్లం హెడ్ గా వ్యవహారించారు.

ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ (ISO) మరియు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) లతో పాటు అంతర్జాతీయ ప్రామాణీకరణకు బాధ్యత వహించే మూడు ప్రపంచ సంస్థలలో IEC ఒకటి. ప్రభుత్వేతర మరియు లాభాపేక్షలేని సంస్థగా IEC.. విద్యుత్, ఎలక్ట్రానిక్స్ మరియు సంబంధిత సాంకేతికతలకు అంతర్జాతీయ ప్రమాణాలను అభివృద్ధి చేయడంలో..  ప్రచురించడంలో ప్రత్యేకత కలిగి ఉంది. IEC ప్రమాణాలు విద్యుత్ శక్తి ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ నుండి గృహోపకరణాలు, కార్యాలయ పరికరాలు, సెమీకండక్టర్లు, ఫైబర్ ఆప్టిక్స్, బ్యాటరీలు, సౌరశక్తి, నానోటెక్నాలజీ మరియు సముద్ర శక్తి వంటి విస్తృత శ్రేణి సాంకేతికతలను కవర్ చేస్తాయి.

ఈ సమావేశం సందర్భంగా IEC అధ్యక్షుడు నివేదిక సమర్పించారు. ఇది కమిషన్ వ్యూహాత్మక ప్రణాళికను తెలియజేస్తుంది. సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను, వాటిని అధిగమించడానికి పరిష్కారాలను కూడా నివేదికలో ప్రస్తావించారు. దీంతోపాటు 2024 కోసం IEC ఆర్థిక నివేదికలను, 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  అలాగే, IEC ట్రెజరర్ మరియు బోర్డు వైస్ చైర్ పర్సన్ ను తిరిగి ఎన్నుకున్నారు. అలాగే 2026-2028 కాలానికి అడ్వైజరీ కమిటీ సభ్యులను నియమించారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com