ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- September 23, 2025
న్యూ ఢిల్లీ: ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం- అవార్డులు అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి( భగవంత్ కేసరి)- దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి(హనుమాన్)
71వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఘనంగా జరిగింది. 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రాలు, నటులు, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పురస్కారాలతో పాటు ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఉత్తమ తెలుగు చిత్రంగా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ ఎంపిక కాగా, దర్శకుడు అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి అవార్డులు అందుకున్నారు.
దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్ రెడ్డి, VFX సూపర్వైజర్ జెట్టి వెంకట్ కుమార్ ‘హనుమాన్’ చిత్రానికి ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో అవార్డులు అందుకున్నారు. అదే చిత్రానికి బెస్ట్ యాక్షన్ విభాగంలో స్టంట్ కొరియోగ్రాఫర్లు నందు, పృధ్వి జాతీయ పురస్కారాలు అందుకున్నారు.
సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ ‘యానిమల్’ చిత్రానికి ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో నేషనల్ అవార్డు అందుకున్నారు.
అవార్డులు అందుకున్న వారందరికీ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వార్తలు
- TPCC డాక్టర్స్ సెల్ వైస్ చైర్మన్ గా డాక్టర్ కరిష్ని చిత్తర్వు నియామకం..!!
- ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణి చేసిన ఎంపి బాలశౌరి
- ఏపీ: కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు
- హైదరాబాద్లో గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ 2026
- 2026 సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
- శ్రీరాముడి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
- మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన సందీప్ మక్తాలా
- NABARD రిక్రూట్మెంట్ అలర్ట్–అర్హతలు, తేదీల పూర్తి వివరాలు…
- రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసెంబర్ 4న భారత పర్యటన..
- షార్క్ లో NBK క్షేత్ర పర్యటన..!!







