సుప్రీంకోర్టు సూచనలను స్వాగతించిన తెలంగాణా సీఎం
- July 20, 2016
పాలమూరు, డిండి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందన పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు చేసిన సూచనలను సీఎం కేసీఆర్ స్వాగతించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు స్పందనతో పాలమూరు ప్రాజెక్టుకు పట్టిన శని విరగడవుతుందన్నారు. పాలమూరు, డిండి ప్రాజెక్టులకు శాశ్వతంగా అడ్డంకులు తొలిగినట్లేనని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు దరిమిలా పాలమూరు, డిండి ప్రాజెక్టులను రాకెట్ వేగంతో పూర్తి చేస్తమని ఉద్ఘాటించారు. ఆగమేఘాల మీద పనులు పూర్తి చేసి ప్రాజెక్టుల ఫలితాలను ప్రజలకు అందిస్తామని వెల్లడించారు. ఏపీ అభ్యంతరాలకు ఎక్కడా విలువ లేనందున పాలమూరు, డిండి ప్రాజెక్టులను శరవేగంగా నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







