మెడికల్ కండిషన్‌కీ లైసెన్స్‌కీ లింకు
- July 20, 2016
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టిఎ) త్వరలో తీసుకోనున్న నిర్ణయం డ్రైవర్లకు షాక్ ఇవ్వనుంది. మెడికల్ కండిషన్ ఆధారంగా లైసెన్సుల రద్దు చేసే దిశగా కొత్త ఆలోచన చేస్తోంది ఆర్‌టిఎ. హైపర్‌టెన్షన్, ఎపిలెప్సీ, కార్డియాక్ సమస్యలు, అలాగే తీవ్రమైన డయాబెటిస్, డైమెన్షియా, మానసిక సమస్యలు వంటి వాటితో బాధపడుతున్న డ్రైవర్ల లైసెన్సులు రీవోక్ చేయడమే ఈ ఆలోచన తాలూకు ఉద్దేశ్యం. ప్రస్తుతానికి అయితే ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినా అతి త్వరలోనే ఈ నిర్ణయం డ్రైవర్లకు ఇబ్బందికరంగా మారనుంది. కొన్ని దేశాల్లో డ్రైవర్ల మెడికల్ కండిషన్‌ని బట్టి లైసెన్సులు మంజూరు చేస్తారనీ, ఆ విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని ఆర్‌టిఎ ముఖ్య అధికారి ఒకరు వెల్లడించారు. ఎపిలెప్సీతో బాధపడే వ్యక్తి వాహనాన్ని కంట్రోల్ చెయ్యలేడని ఆయన తెలిపారు. అలాగే హైపర్‌టెన్షన్‌తో బాధపడేవారు, ఇతరత్రా ఆరోగ్య సమస్యల వల్ల రహదారిపై వాహనాన్ని అదుపు చేయలేకపోతే తద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటాయని ఆ అధికారి వివరించారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







