హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు
- September 24, 2025
అమెరికాలో చదవడం, ఉద్యోగం చేయడం అనేకులు కలలు కంటారు. వీలైతే అక్కడే స్థిరపడాలని ఆశిస్తారు. అందుకోసం లక్షల్లో రుణాలు తీసుకుని, మరీ ఎంఎస్ చదువుకునేందుకు ఎంతోమంది భారతీయులు అక్కడికి వెళ్లారు. చదువు అయిపోయాక అక్కడే ఉద్యోగం వెతుక్కుని, స్థిరపడిపోతున్నారు. అయితే ఇక ఆ కలలు కన్నీరుగానే మిగిలిపోనున్నది. ఇందుకు కారణం హెచ్-1బీ వీసాపై లక్ష డాలర్ల (రూ. 88లక్షలు) వరకు పెంచడంతో భారతీయ టెక్కీలు, టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపనున్నది. ట్రంప్ నిర్ణయంతో భారత ఐటీ రంగంలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వేలాది మంది భారతీయ నిపుణుల అమెరికా కల కల్లలయ్యే ప్రమాదం ఉంది.
ప్రతినెలా 5,500 మంది ఉద్యోగాలు కోల్పోతారు
ప్రపంచ ప్రఖాత ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ అండ్ కో ఈ ప్రతిపాదన వల్ల కలగబోయే నష్టాలపై ఒక నివేదిక విడుదల చేసింది. ఆ సంస్థ ఆర్థికవేత్తలు అబియల్ రీన్హర్ట్, మైఖేల్ ఫెరోలీ ప్రకారం ఈ విధానం అమలైతే ప్రతినెలా సగటున 5,500మంది విదేశీ నిపుణులు అమెరికాలో ఉద్యోగ అనుమతులు పొందే అవకాశాన్ని కోల్పోతారు. దీని ప్రభావం టెక్నాలజీ కంపెనీలు వాటిలో అత్యధికంగా పనిచేస్తున్న భారతీయ టెక్కీలపైనే పడుతుందని ఆ నివేదిక స్పష్టం చేసింది. గత సంవత్సరం జారీ అయిన మొత్తం హెచ్-1బీ వీసాల్లో 71శాతం భారతీయులే దక్కించుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి.
వెనకడుగులు వేస్తున్న టాప్ కంపెనీలు
ట్రంప్ తీసుకొచ్చిన హెచ్-1బీ వీసా పెంపుతో పలు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హెచ్-1బీ వ్యవస్థను సమూలంగా ధ్వంసం చేసే చర్యగా సీనియర్ ఆర్థికవేత్త లౌజైనా అబ్జెల్వాహెద్ అభివర్ణించారు. ఈ ఫీజు పెంపువల్ల చిన్న, మధ్య తరహా కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడానికి వెనుకాడతాయి. ఫలితంగా ఏటా 1,40,000కొత్త ఉద్యోగాల సృష్టి ప్రమాదంలో పడుతుంది. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టం అని ఆమె హెచ్చరించారు.
న్యాయపోరాటానికి యత్నం
ట్రంప్ ప్రతిపాదనపై చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. టెక్ పరిశ్రమకు కేంద్రమైన కాలిఫోర్నియా రాష్ట్ర అటార్నీ జనరల్ రాబ్ బొంటా ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానంపై మేం చట్టపరమైన సమీక్ష జరుపుతున్నాం. మా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నైపుణ్యం కలిగిన ఉద్యోగులపైనే ఆధారపడి ఉంది. ఈ ఫీజు అనిశ్చితిని సృష్టించి, మా కంపెనీల భవిష్యత్తును దెబ్బతీస్తుంది అని ఆయన అన్నారు.
హెచ్-1బీ వీసా అంటే ఏమిటి?
హెచ్-1బీ వీసా అమెరికాలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులు పనిచేయడానికి అమెరికా కంపెనీలకు ఇస్తున్న వీసా.
హెచ్-1బీ వీసా పెంపు కంపెనీలకు ఎలా ప్రభావం చూపుతోంది?
ఎక్కువ వీసా క్వోటా ఉన్నందున టెక్ కంపెనీలు ప్రతిభావంతులైన విదేశీ ఉద్యోగులను ఉద్యోగాలలో నియమించుకోవడంలో సులభత పొందుతున్నాయి.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్ను నిర్వహించిన జనసేన గల్ఫ్సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







