ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- September 24, 2025
దోహా: ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ విడుదలైంది. విజిట్ ఖతార్, ప్రొఫెషనల్ ట్రయాథ్లెట్స్ ఆర్గనైజేషన్ (PTO) రన్ నిర్వాహణ తేదీలను ప్రకటించాయి. ఖతార్ T100 ట్రయాథ్లాన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ డిసెంబర్ 10న ప్రారంభం అవుతుంది. ఫ్యామిలీ, యూత్ కేటగిరీల్లో వన్ కే, 5 కే రన్ నిర్వహిస్తారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి టీ షర్ట్ ను ఉచితంగా అందజేస్తారు. రన్ లో విజేతగా నిలిచిన వారికి మెడల్స్ అందిస్తారు. చివరగా డ్రోన్ షో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
డిసెంబర్ 1–18 వరకు జరిగే FIFA అరబ్ కప్ ఖతార్ కోసం దోహాకు వచ్చే ఆయా దేశాల ఫుట్‌బాల్ అభిమానులు కూడా ఈ రన్ లో పాల్గొనాలని ఆహ్వానించారు. ఆయా జట్ల అభిమానులు తమ జాతీయ రంగులను ధరించి రన్ లో పాల్గొనడం ద్వారా తమ జట్లకు మద్దతు తెలపాలని సూచించారు.
ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ డిసెంబర్ 10 న ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్‌తో సహా లుసైల్‌లో నాలుగు రోజుల ట్రయాథ్లాన్ ఫెస్టివల్ ప్రారంభం అవుతాయి. డిసెంబర్ 11న లుసైల్ ప్లాజా లో ఈవెంట్ మరియు ఫ్యాన్ విలేజ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 12 న ముగిసే 'రేస్ టు ఖతార్' లో విజేతలకు టైటిళ్లను అందజేస్తారు. ఇక డిసెంబర్ 13న T100 ఏజ్-గ్రూప్ వరల్డ్ ఛాంపియన్‌షిప్, ఓపెన్-ఎంట్రీ 100 కి.మీ డిస్టెన్స్, స్ప్రింట్ ట్రయాథ్లాన్ ప్రారంభం అవుతాయి. ప్రపంచ ఛాంపియన్‌షిప్ లో భాగంగా అరేబియా గల్ఫ్ లో 2 కి.మీ స్విమ్మింగ్, నగరంలోని ల్యాండ్‌మార్క్ స్ట్రీట్స్ గుండా 80 కి.మీ సైక్లింగ్, లుసైల్ ప్లాజా మరియు బౌలేవార్డ్ మీదుగా 18 కి.మీ రన్ ఉంటాయి.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు