బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- September 26, 2025
మనామా: ఇథియోపియాలోని సాంస్కృతిక సంప్రదాయాలలో ఒకదాన్ని బహ్రెయిన్ లో నిర్వహిస్తున్నారు. ఇథియోపియా ఆర్థోడాక్స్ టెవాహెడో చర్చి కమ్యూనిటీ జల్లాక్‌లోని బహ్రెయిన్ బీచ్ బేలో జరిగే వార్షిక మెస్కెల్ ఉత్సవంలో పాల్గొనమని ప్రజలను ఆహ్వానించింది. యునెస్కో గుర్తించిన ఈ ఫెస్టివల్, 4వ శతాబ్దపు ఎంప్రెస్ సెయింట్ హెలెనా ద్వారా ప్రారంభించారు.
మెస్కెల్ అనేది కేవలం మతపరమైన ఆచారం మాత్రమే కాదు, ఇథియోపియాలో ఇది వర్షాకాలం ముగింపు మరియు కొత్త సంవత్సరం ప్రారంభానికి సూచనగా జరుపుకుంటారు. బహ్రెయిన్ లోని ఇథియోపియా ప్రవాసులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ వేడుక సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:00 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..
- మిగ్-21 విమాన స్థానంలో తేజస్ జెట్లు
- పండగ సీజన్ లో ప్రత్యేక భీమా కల్పించిన ఫోన్ పే