టెన్నిస్ క్వార్టర్స్‌లో తెలుగు తేజాలు...
- July 20, 2016
తెలంగాణ కుర్రాడు తీర్థ శశాంక్ జోరుమీదున్నాడు. సింగపూర్‌లో జరుగుతున్న అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) జూనియర్స్ గ్రేడ్-5 టోర్నీలో అతను సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. కల్లాంగ్ టెన్నిస్ సెంటర్లో బుధవారం జరిగిన బాలుర సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో తీర్థ శశాంక్ 6-3, 6-3తో ఐదో సీడ్ ఆర్మిన్ రోస్తామి (ఇరాన్)కి షాకిచ్చాడు.బాలుర డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ద్రోణ వాలియాతో జతకట్టిన శశాంక్ 4-6, 7-5, 10-8తో దర్శన్ సురేశ్ (మలేసియా)-షెంగ్ యిన్ స్టిఫెన్ (చైనా)లపై చెమటోడ్చి నెగ్గాడు. బాలికల సింగిల్స్‌లో తెలుగమ్మాయి శ్రీవల్లి రష్మిక కూడా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రిక్వార్టర్స్‌లో ఆమె 6-3, 6-2తో ఎనిమిదో సీడ్ యిమ్ అష్లె (చైనా)పై సంచలన విజయం సాధించింది.
తాజా వార్తలు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు







