ఏపీలో విద్యుత్ ఛార్జీలు తగ్గింపు
- September 29, 2025
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రజా సమస్యలపై దృష్టిపెట్టి పనిచేస్తుందని మంత్రి గొట్టిపాటి రవి అన్నారు. బాపట్ల జిల్లా అద్దంకి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. దాతల సహకారంతో 35 మంది దివ్యాంగులకు ట్రై స్కూటీలను పంపిణీ చేశారు. ప్రజా సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వచ్చే నెల నుంచి విద్యుత్ ఛార్జీలు ఒక్కో యూనిట్ పై 0.13పైసలు తగ్గిస్తున్నామని తెలిపారు. అంతకుముందు అద్దంకి పట్టణంలోని శ్రీ చక్రాసహిత వాసవి అమ్మవారికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తాజా వార్తలు
- సల్మాన్ ఖాన్ కేసులో నిందితుడు అన్మోల్ ఇండియాకు అప్పగింత
- ధర్మ ధ్వజం: అయోధ్య నూతన వైభవం
- టీటీడీకి రూ.2 కోట్లు విరాళం
- సహాంలో పది మంది అరెస్టు..!!
- FIFA అరబ్ కప్ టికెట్ అమ్మకాలు నిలిపివేత..!!
- రిథమిక్ జిమ్నాస్టిక్స్ లో మెరిసిన 9 ఏళ్ల భారతీయ బాలిక..!!
- బహ్రెయిన్ లో గ్లోబల్ ఫుడ్ షో..!!
- యూఏఈలో లోన్ల పై సాలరీ పరిమితి ఎత్తివేత..!!
- వచ్చెనెల 30 నుంచి పది రోజుల పాటు వైకుంఠద్వార దర్శనాలు: TTD ఛైర్మన్
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు







