ఎల్పీజీ కొరత పై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన
- March 12, 2026
న్యూ ఢిల్లీ: దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఇంకా పెరగకముందే కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ ప్రాంగణంలో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత వేధిస్తున్న సంగతి తెలిసిందే. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత భారీ స్థాయిలో ఉంటే, గృహ వినియోగదారులకు కూడా తగిన స్థాయిలో సిలిండర్లు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని ప్రతిపక్షం ఆందోళన చేపట్టింది. గురువారం ఉదయం పార్లమెంట్ ప్రాంగణంలో ప్రతిపక్ష నేతలు దీనిపై నిరసన చేపట్టారు. గ్యాస్ కొరత సమస్యను త్వరగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ‘‘దేశంలో చమురు కొరతపై కేంద్రం త్వరగా స్పందించాలి. సంక్షోభంగా మారకముందే మేల్కోవాలి. కేంద్ర విదేశాంగ విధానం మారాలి. దేశంలో గ్యాస్ ఒక ప్రాబ్లం. చమురు ఒక ప్రాబ్లం. పెట్రోల్ ఒక ప్రాబ్లం. ఎందుకంటే మనం ఇంధన భద్రతలో రాజీపడ్డాం. లోపాలతో కూడిన విదేశాంగ విధానమే ఇందుకు కారణం. చమురు సమస్యపై ముందు జాగ్రత్త అవసరం. ప్రధాన మంత్రి, ప్రభుత్వం దీనిపై త్వరగా స్పందించాలి. ప్రజలపై భారం పడకుండా చూడాలి. నేను ఇలాంటి అంశాలపై మాట్లాడటానికి ఒక విధానం ఉంటుంది.
ఎల్పీజీ, గ్యాస్, ఆయిల్ సమస్యపై నేను మాట్లాడాలి. కానీ, ఇప్పుడు ఇలా మాట్లాడటానికి కొత్త విధానం తీసుకొచ్చారు. ముందుగా దీనిపై మంత్రి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత నేను మాట్లాడుతా. ఆ తర్వాత మంత్రి సమాధానం ఇస్తారు. ఈ విషయంలో ఏం జరుగుతుందో చూడాలి’’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల నిరసనలో కాంగ్రెస్‌తోపాటు డీఎంకే, టీఎంసీ, ఎస్పీ సహా ఇతర పార్టీలకు చెందిన ఎంపీలు పాల్గొన్నారు. ప్రతిపక్ష మహిళా ఎంపీ ప్రియాంకా గాంధీ కూడా దేశంలో చమురు కొరతపై వంట స్టవ్ వద్ద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







