అటల్ జీ ఆశయాలను భవిష్యత్ తరాలకు అందజేయాలి: వెంకయ్యనాయుడు
- March 12, 2026
న్యూఢిల్లీ: భారతదేశ గౌరవ పూర్వ ఉపరాష్ట్రపతి మరియు ‘అటల్ స్మృతి న్యాస్ సొసైటీ’ అధ్యక్షులు ముప్పవరపు వెంకయ్య నాయుడు ఇవాళ ఢిల్లీలో 1, త్యాగరాజ్ మార్గ్ లో ఉన్న తమ అధికారిక నివాసంలో పలువురు ప్రజా ప్రతినిధులు, అటల్ జీ తో పని చేసిన పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు.భారతదేశ గౌరవ పూర్వ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ జీవితం, వారు పాటించిన విలువలు మరియు దేశానికి వారు అందించిన అసమానమైన సేవలను గౌరవించుకోవడంతో పాటు, వారి వారసత్వాన్ని భావితరాలకు అందించడమే లక్ష్యంగా ఈ భేటీ సాగింది. ఈ సందర్భంగా అటల్ స్మృతి న్యాస్ సొసైటీ చేపట్టబోయే వివిధ కార్యక్రమాలపై వెంకయ్య నాయుడు సుదీర్ఘంగా చర్చించారు.
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబిన్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, జి.కిషన్ రెడ్డి, పూర్వకేంద్ర మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ,సయ్యద్ షానవాజ్ హుస్సేన్, రాజీవ్ ప్రతాప్ రూడీ,ఏబీవీపీ (ABVP) పూర్వ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ భాటియా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, పూర్వ ప్రధాని అటల్ జీకి మీడియా సలహాదారు అశోక్ టాండన్, పూర్వ ప్రధానికి నాటి ఓఎస్‌డీ రాజ్ కుమార్ శర్మ తదితరులతో చర్చించారు.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..అటల్ జీ ఒక మహోన్నత నాయకుడని, ఆయన జీవితం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా సొసైటీ ద్వారా దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను విస్తరిస్తామని వెల్లడించారు.ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు అటల్ జీతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, సొసైటీ కార్యకలాపాలకు తమ పూర్తి సహకారాన్ని అందజేస్తామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







